పూజారి మాటలను లెక్క చేయని జంట.. ఏమైందంటే ?

Satvika
ఇప్పటి కాలంలో చాలా మంది దేవుడు ఉన్నాడని అంటే అస్సలు నమ్మరు. కళ్ళతో చూస్తే గాని ఏది నిజమని నమ్మరు. ఈరోజుల్లోని కంప్యూటర్ వాళ్ళకు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఇది మంచి ఉదాహరణ.. దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఇదొక  నిదర్శనం.. ఓ పూజారి చెప్పిన వినకుండా గుడిలోపలికి వెళ్లిన వాళ్లకు ఏం జరిగిందో తెలుసుకుందాం...వారణాశి హిందువులకి పవిత్ర పుణ్య క్షేత్రం..అంతేకాకుండా చాలా శక్తీ కలిగిన ప్రదేశం..జల ప్రళయం కూడా ఈప్రదేశం ని ఏంచేయలేదని మనందరికీ తెలుసు.ఈ వారణాసిలో ఒక అమ్మవారు ఉన్నారు.. ఆమె మహిమలు చాల గొప్పవి, వర్ణనాతీతం ..ఈమె వారాహి అమ్మవారు,ఈమె వరాహి ముఖం కలిగి ఉంటుంది.ఎలాగంటే శివుడు నుండి శివాని,విష్ణువు నుండి వైష్ణవి ఎలా ఉద్బవించారో అదే విదంగా వారాహి స్వామి నుండి వరాహి ఉద్బవించారు..ఈమె ముఖం వరాహి రూపంతో ఉండి,చేతిలో ఖడ్గం కలిగి ఉంటుంది.

ఈ అమ్మవారు వారణాశికి గ్రామ అమ్మవారు.ఇక్కడ రక్షించే అమ్మవారుగా వీరి నమ్మకం..ఈ అమ్మకు ఒక గుడి కూడా ఉందంట.ఈ గుడి భూమిలోపల కొలువై ఉంటుంది.ఈ గుడికి పోవాలంటేనే ఉదయం నాలుగు గంట ముప్పై నిమిషాల నుండి ఎనిమిది వరకు మాత్రమే తెరిచి ఉంటారు.ఆలయంలోకి వెళ్ళినపుడు రెండు కర్ణాలు ఉండి, అమ్మవారి దర్శన భాగ్యం ఇక్కడే జరుగుతుంది..విశేషమేంటంటే ఒక రంద్రంలో అమ్మ ముఖం,మరో రంద్రంలో అమ్మ పాద ముద్రలు కనపడుతాయంట.అమ్మ ఉగ్రరూపంలో ఉంటారు కనుకే ఇలా కర్ణాలు ద్వారా దర్శనం భాగ్యం కలిగిస్తున్నారు..ఇది ఇలాగుండగా కొత్తగా పెళ్ళైన జంట పూజారి మాట వినకుండా మేము అమ్మను చూడాలని మొండికేశారు.ఆలా లోపలి వెళ్లిన వెంటనే స్పృహ కోల్పోయారు..
ఇది చూసి పూజారి వెంటనే వాళ్లను బయటకు తీసుకొచ్చారు..ఒక గంట పాటు శాంతి మంత్రాలను వినిపించగా మామూలు స్థితిలోకి వచ్చారు..మాములుగా ఇక్కడ అమ్మవార్లు రెండు రకాలు ఉంటారు..ఉగ్ర కల శాంతి కలలో ,ఈమె  ఉగ్ర కల అమ్మవారు శత్రువులను సంహరించడానికి పూజిస్తారు అని పూజారి చెప్పుకొచ్చాడు..మానవ మాత్రులు ఈ రూపాన్ని చూసి భరించలేరనే కర్ణాల గుండా చుపిస్తాము...అని పూజారి అక్కడ విశేషాలను అందరికి వివరిస్తూ,4  నుండి 8  గంటల ప్రాంతంలో అమ్మ వారణాశిని చూడటానికి వెళ్తారు అందుకే దర్శనం కల్పిస్తున్నామని ఆలయ విశిష్టతలను పూజారి వివరించారు. ఇలా ఆ అమ్మవారి మహిమలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. ఇది కాశీలోని వారాహి అమ్మవారి విశిష్టతలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: