పెళ్ళైన మహిళలు అత్తింటికి ఈ వస్తువులు తీసుకెళ్లకూడదు ?

VAMSI
సాధారణంగా వివాహమైన మహిళలు వారి పుట్టింటికి వెళ్ళే సందర్భం వస్తే చాలు ఎంతో సంతోషంతో ఉప్పొంగి పోతారు. మెట్టింట్లో ఎన్ని సిరిసంపదలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు ఉన్నా  వారి పుట్టింటి వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషమే వేరు. మహిళలకు అనురాగం ఆప్యాయతలు అనే వాటిని  ఎక్కువ పెంచుకుంటున్నారు. తమను కని పెంచి పెద్ద చేసిన తన పుట్టింటి వారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఎంతో  ఉత్సాహం చూపుతారు ఆడవారు. అదే విధంగా వారు మెట్టినింటికి తిరిగి వెళ్ళే సమయంలో వారి కుటుంబీకులు బట్టలు, సామగ్రి వంటి బహుమతులు ఇవ్వకుండా పంపించరు. అలాగే నచ్చిన వాటిని వాల్లే స్వయంగా  తీసుకువెళుతుంటారు. 

అయితే పెళ్లయిన మహిళలు కొన్ని వస్తువులను తమతో పాటు మెట్టినింటికి అసలు తీసుకెళ్ల కూడదని, ఒకవేళ అలా తీసుకెళ్తే చాలా అశుభమని చెబుతున్నారు శాస్త్రాలు చదివిన పండితులు. అలాంటి వస్తువులు ఏమిటి ? ఎందుకు తీసుకు వెళ్ళకూడదో ? ఇప్పుడు చూద్దాం.  పెళ్ళైన మహిళలు  పుల్లటి మరియు చేదు వస్తువులను   పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు.  పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని, అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు.
* అదే విధంగా వివాహం అయిన మహిళలు పుట్టింటి నుండి చీపురు అసలు తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకుంటే  పుట్టింటిలక్ష్మిని  నీతో పాటు మెట్టినింటికి తీసుకు వెళుతున్నట్లు అవుతుందన్నారు.
ఒకవేళ ఈ వస్తువులను తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బులు పుట్టింటివారికి ఇచ్చి తెచ్చుకోవడం మంచిదంటున్నారు మన పెద్దలు.
* అలాగే నల్లగా ఉన్నటువంటి వస్తువులను కానీ వస్త్రాలను కానీ మహిళలు తెచ్చుకోరాదు అంటున్నారు.
* అలాగే పూజ సామగ్రికి సంబంధించిన ఏ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోరాదు. అదే విధంగా ఇనుముతో చేయబడిన వస్తువులను కూడా తెచ్చుకోకండి అంటున్నారు వేదాలు తెలిసిన పెద్దలు. పెళ్ళైన మహిళలు అత్తింటికి ఈ వస్తువులు తీసుకెళ్లకూడదు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: