"అన్నం" తినే సమయంలో ఇలా చేస్తున్నారా ?

VAMSI
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నం తినేటప్పుడు కూడా ఒక పద్ధతి, విధానం అనేది చాలా ముఖ్యం. ఎంతో పవిత్రమైన అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి అంటున్నారు వేదాలను అవపోశన పట్టిన పండితులు. పూర్వ కాలంలో అన్నాన్ని విస్తరాకులలో తినేవారు. రానురాను కాలం మారి విస్తరాకులు కాస్త పోయి ప్లేట్లు వచ్చాయి. అదే విధంగా అన్నం తినే పద్ధతి కూడా మారింది. ఒకప్పుడు పీతలు వేసుకుని, నేల మీద  కూర్చుని భోజనం చేసేవారు ఇది అప్పటి ఆచారం. ఇలా నేల మీద కూర్చుని భోజనం చేయడం వలన భూమికి  ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది , అలాగే భూమిని ఆశ్రయించి కొన్ని గ్రహాలు ఉంటాయి కనుక అచ్చంగా నేలపై కూర్చుని తిన్న వాళ్ళకి అన్నం వంట పట్టకుండా ఉంటుంది. 

అందుకే తప్పనిసరిగా పీట వేసుకొని కూర్చొని భోజనం చేసే పద్ధతి ఏర్పడింది. అయితే ఇప్పట్లో పీట వేసుకొని అన్నం తినే పద్ధతి క్రమంగా కనుమరుగైపోయింది.  చాలా మంది మంచంపై కూర్చుని తినడం అలవాటు చేసుకున్నారు. మంచం మీద  కూర్చొని హాయిగా భోజనం కానిచేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఆ ఇంటికి అష్ట దరిద్రం అని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. మంచం మీద కూర్చుని అన్నం తినడం వల్ల ఆ తిండి ఒంటికి పట్టదని అంతేకాక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఇంట్లో గొడవలు పెరుగుతాయని చెబుతున్నారు పండితులు.

కాబట్టి మంచం పైన భోజనం చేయకూడదు. అదే విధంగా భోజనం చేసే  సమయంలో ముందుగా దేవుడిని ప్రార్ధించు కొని ఆ తర్వాత భోజనం చేయడం ప్రారంభించాలి. అలాగే అన్నం వడ్డించే సమయంలో భోజన పదార్థాలకు ఎంగిలి తగలకుండా వడ్డించాలి. అన్నం కింద పడకుండా తినాలి. భోజనం చేసే సమయంలో ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి అని చెబుతున్నారు వేద పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: