నేడే సూర్య గ్ర‌హ‌ణం.. ఈ స‌మ‌యంలో ఆ త‌ప్పులు మాత్రం చేయ‌వ‌ద్దు..

Kavya Nekkanti

సూర్య గ్రహణం.. కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి గ్రహణం 2019 డిసెంబరు 26(నేడు) ఏర్పడుతోంది.  ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా, మోక్షకాలం ఉ.11.11. మూడు గంటల పాటు ఉండే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేయనుంది. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను బుధవారం రాత్రి నుంచి మూసివేసి, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత పునఃప్రారంభిస్తారు.

 

అయితే గ్రహణ సమయంలో వండిన ఆహారపదార్ధాలు, ఫలాలు కలుషితం అవుతాయని పూర్వికులు భావించేవారు. అందుకే ఆ సమయంలో వండిన అన్నం, పండ్లు తినకూడదని చెబుతారు. ఆ సమయంలో భోజనం తినడం గానీ, నీరు త్రాగడం గానీ, సంభోగం వంటి పనులు చేయకూడదట.గ్రహణ కాలం వరకూ దేవతా మూర్తులమీద, నిల్వఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి, గ్రహణం వెళ్లిపోయాక తీసి వేయాలి. ముఖ్యంగా గర్భిణీలు ఈ సమయంలో కదలకుండా పడుకోవాలి అని చెబుతారు పెద్దలు. దీని వల్ల గర్భంలోని పిండిపై ప్రభావం పడి పిల్లలకు గ్రహణ మొర్రి, ఇతర లోపాలతో పుడతారని చెబుతారు. 

 

అలాగే గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం వల్ల అందులో నుంచి కాస్మిక్ కిరణాలు హాని కలిగిస్తాయి. ఇవి పరిశోధనాత్మకంగా కూడా నిరూపితమయ్యాయి. ఈ కిరణాలు.. గర్భిణీలపై ప్రభావంతో చూపుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఈ సమయాన్ని చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆరాటపడతారు. అయితే దీనిని వీక్షించొచ్చు కానీ, నేరుగా వీక్షించకూడదు. బ్లాక్ ఫ్రేమ్, ఎక్స్‌రే వంటి వాటితో చూడొచ్చు. ఇక గ్రహణం అనంతరం మళ్లీ శుభ్రంగా స్నానాలు చేసి శివాలయాలకు వెళ్లి దీపారాధన చేయాలని చెబుతున్నారు.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: