సూర్యగ్రహణం రోజు ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర ప్రభావం చూపిస్తుంది..!

Durga Writes

ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ఈ నెల 26న గురువారం రానుంది. ఈ సూర్యగ్రహణం 26 గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 11.10 వరకు కొనసాగుతుంది. ఈ సూర్య గ్రహణం కారణంగా ఆరోజు ఆలయా సాంప్రదాయ ప్రకారం ఆలయాలు మూతపడనున్నాయి. 

 

మూల నక్షత్రం మకర, కుంభ లగ్నాలలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో కనిపించనుంది. ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం మ‌రో 16 ఏళ్లు వరుకు రాదు.

 

అయితే సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని జోతిష్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

సూర్యగ్రహణం చూసే సమయంలో అద్దాలు లేకుండా చూడకూడదు. 

 

ఎవరైన సరే గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడకూడదు. 

 

గర్భవతులు భయపడాల్సిన అవసరం లేదు.. గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది. 

 

గ్రహణ పట్టు, విడుపు మధ్య స్నానాలు చేసేవారు వారికీ ఉన్న మంత్రనుష్టానములతో ఆచరించి యధావిధిగా స్నానాలు ఆచరించి నిర్విహించవచ్చు. 

 

గ్రహణం గురించి ఎవరూ ఎలాంటి భయం కాని అందోళన కాని చెందాల్సిన అవసరం లేదు. 

 

గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు, ఒక స్పూన్ పచ్చి ఆవుపాలు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని, శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు, యంత్రాలను కడిగిన తరవాత దీపారాధన చేయాలి. 

 

గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి, కొబ్బరి కాయలు శక్తిని కోల్పోతాయి, కాబట్టి తిరిగి కుంటుబ సభ్యుల శ్రేయస్సు కోరుతూ ఇంటికి, వ్యాపార సంస్థల రక్షణ కొరకు గుమ్మడికాయను కొత్తగా శాస్త్రోక్తంగా ''కుష్మాండ'' పూజ చేయించుకుని గుమ్మానికి కట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు గ్రహణం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తప్పకుండ తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: