స్మరణ : తెలుగు సినిమాలతో ప్రత్యేక అనుబంధం ఉన్న అమ్రీష్ పురి ..

Divya

అమ్రీష్ పురి గురించి అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి, ఒకానొక సందర్భంలో బాగా భయపెట్టారు కూడా. అప్పట్లో విలన్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి , అందరి చేత శభాష్ అనిపించుకున్నారు అమ్రీష్ పురి. ఈయన అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ ఎన్నో చిత్రాలలో నటించి, ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక అమ్రీష్ పురి జూన్ 22న 1932లో బ్రిటిష్ ఇండియా (పంజాబ్) లో జన్మించారు. బాలీవుడ్ చిత్రాల్లో తనదైన నటనతో విలనిజానికి కొత్త పుంతలు తొక్కించిన నటుడు ఎవరు అంటే అమ్రిష్ పురి అని చెప్పవచ్చు. ముఖ్యంగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన మిస్టర్ ఇండియా సినిమాలో క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక తెలుగులో కూడా ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆదిత్య 369 వంటి పలు విజయవంతమైన చిత్రాలలో తనదైన విలనిజాన్ని చూపించి , తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

ఈయన హిందీ లో విలన్ గానే కాకుండా, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా  కూడా పనిచేసి అదే రేంజ్ లో అందరిని మెప్పించారు. ఏ పాత్ర తీసుకున్నా తనదైన శైలితో, ఆ  పాత్రలకు జీవం పోయడం అమ్రిష్ పూరి ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈయన దాదాపుగా నాలుగు వందలకు పైగా సినిమాలలో నటించారు. ఈయన తెలుగు హిందీ,కన్నడ,తమిళ సినిమాలలో కూడా నటించారు. ఇక అమ్రీష్ పురి తెలుగులో మొదటిసారి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆకరి పోరాటం సినిమాతో అరంగేట్రం చేస్తే , చివరి సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించిన మేజర్ చంద్రకాంత్. మొత్తంగా తెలుగులో ఏడు చిత్రాల్లో విలన్ గా  మెప్పించిన అమ్రీష్ పురి తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. అంతేకాకుండా డా ఎన్నో ఫిలింఫేర్ అవార్డుతో పాటు అంతర్జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాలు కూడా అందుకున్నాడు. చివరిగా 2005 జనవరి 12న ముంబైలో కన్నుమూశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: