అక్ష‌రాలతో నిజాంపై పోరాడిన షోయాబ్ ఉల్లాఖాన్‌.. నేడు జ‌యంతి

Spyder
నిజాం ప్ర‌భువు నియంతృత్వాన్ని, ర‌జాకార్ల దాష్టీకాన్ని త‌న అక్ష‌రాల‌తో చాటి చెప్పిన తెలంగాణ తొలిత‌రం జ‌ర్న‌లిస్ట్ షోయాబ్ ఉల్లాఖాన్‌‌.  ఆయ‌న రచనా జీవితం తేజ్ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు. అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేధించింది. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్‌నాయకుడు ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న రయ్యత్ పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది.

ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది. రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు. రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసింరజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారుచేశారు.

నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం. ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు. ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు. ఈ పరిణామాలే చివరకు ఆయన దారుణ హత్యకు కారణమయ్యాయి. షోయబుల్లాఖాన్ ను చంపేసిన చోట ఆయన విగ్రహం పెట్టాలనీ, కాచిగూడ చాపెల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలనీ జర్నలిస్టులు డిమాండు చేశారు. అయితే ఆయన పుట్టిన ఊరు ఏదో స్పష్టంగా తెలియడంలేదు. సుబ్రవేడు, సుబ్రదేవ్, మహబూబాబాద్ ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెబుతున్నారు.ఇప్పటికైనా ఆయన జన్మస్థలాన్ని విలేకరులు కనుక్కోవాలి.మండలం, పంచాయతీతో సహా ఆయన ఊరు స్పష్టంగా తెలుసుకొని ఆయనకు జన్మనిచ్చిన ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టాలి. షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్
1948 ఆగస్టు 22 ఖాసీం ర‌జ్వీ అనుచ‌రులు ప‌త్రికాఫీసులోనే దారుణంగా హ‌త్య చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: