అమెరికాలో హిందూ మాసంగా అక్టోబ‌ర్‌..!

Paloji Vinay
ప్ర‌పంచంలో హిందూ మతానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. దేశం ఏదైనా.. అక్క‌డ అధికారిక మ‌తం ఏదైనా హిందూ మ‌తానికి అభిమానులు ఉంటారు. ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో హిందూ శ్లోకాలు, పాఠ్యాంశాలు వారి సిలబ‌స్‌లో చేర్చారు. ముస్లిం దేశం అయిన సౌదీ త‌మ సిల‌బ‌స్ పాఠ్యంశంగా భ‌గ‌వ‌ద్గీత‌ను బోధిస్తోంది. అలాగే హిందూ దేవాల‌యాలు కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నాయి. విదేశాల్లో హిందూ మ‌తానికి, హిందూ ఆచార సంప్ర‌దాయాల‌కు త‌గిన గౌర‌వం ఉంది.


   ఈ క్ర‌మంలోనే అమెరికా  భార‌తీయ సంస్కృతికి  తగిన ప్రధాన్య‌త ఇస్తూ గుర్తింపునిచ్చింది. హిందూ పండుగ‌ల‌కు పెద్ద పీట వేసింది అగ్ర‌రాజ్యం అమెరికా. తాజాగా హిందూ పండుగలకు ఎక్కువ‌గా వ‌చ్చే అక్టోబర్ నెల‌ను 'హిందూ  సాంస్కృతిక వారసత్వ మాసంగా ` ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అమెరికాలోని పలు రాష్ట్రాలు తాజాగా అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌రించాయి.  టెక్సాస్ ఫ్లోరిడా న్యూజెర్సీ ఓహాయో మసాచుసెట్స్ తోపాటు పలు ఇతర రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలు అక్టోబ‌ర్ నెల‌ను హిందూ సాంస్కృతిక వారసత్వ మాసం గా ప్ర‌క‌టిస్తూ అధికారిక ప్ర‌క‌ట‌నను  విడుదల చేశాయి.


   అమెరికాలో హిందూ సంఘాల చేసిన కృషి చేయ‌డం ద్వారా ఇది సాధ్య‌ప‌డింది.  ` అమెరికాలో ఉన్న  వివిధ మతాలు సంస్కృతులు శాంతికి చిహ్నాలుగా.. ఆశాదీపాలుగా నిలిచాయి. ఆయా మతాల వారు తమ సేవల ద్వారా అమెరికా అభ్యున్నతికి దోహ‌ద‌ప‌డుతున్నారు. అందుకే హిందూ మతం, సంస్కృతి చరిత్ర కూడా అమెరికా అభ్యున్నతిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి` అని ఆయా రాష్ట్రాల గవర్నర్లు సెనెటర్లు కాంగ్రెస్ ఓ కీలక ప్రకటనలో పేర్కొన్నారు.

 ఇక అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కూడా అక్టోబర్ ను `హిందూ సాంస్కృతిక మాసంగా` గుర్తించేలా అక్కడి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం మొద‌లు పెట్టాయి.  బైడెన్ ప్రభుత్వాన్ని ఆ దిశగా ప్రోత్సహించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.  హిందూ సంస్కృతి విలువలపై చాలా తక్కువమందికి అవగాహన ఉంద‌ని. ఈ విష‌యం  ఆశ్చర్యం కలిగిస్తోందని విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు అజయ్ సింగ్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవగాహ‌న క‌ల్పించేందుకు,  హిందూ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఇదే మంచి సమయం అని అభిప్రాయ‌ప‌డ్డారు అజ‌య్ సింగ్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: