వార్నీ.. చంద్రబాబు, జగన్, కేసీఆర్.. అంతా అదే పనా?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో ట్రెండ్స్ మారిపోతున్నాయి.. మరి ట్రెండ్‌ను పట్టుకుని నాయకులు ముందుకు వెళ్లాల్సిందే. అలా వెళ్లకపోతే వెనుకబడి పోతారు.. మరి ఆ ట్రెండ్‌ను అందరూ అందిపుచ్చుకుంటున్నారా.. మిగిలిన వాళ్ల సంగతి ఏమో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ పొలిటికల్ స్టార్లయిన చంద్రబాబు, జగన్, కేసీఆర్‌.. ఇప్పుడు అంతా ఇదే స్టయిల్ ఫాలో అవుతున్నారు. మరి ఇంతకీ ఈ స్టయిల్ ఏంటి అంటారా.. చెబుతాను చదవండి..

గతంలో ఓ నాయకుడి ప్రెస్ మీట్ అంటే ఏం ఉండేది.. ఓ బల్ల.. ఓ కుర్చీ.. ఎదురుగా విలేఖర్లు కూర్చునేందుకు కుర్చీలు.. నాయకుడు చెప్పింది వినిపించేందుకు ఓ మైక్.. ఇవి ఉంటే చాలు ఓ ప్రెస్ మీట్ ప్రారంభం అయ్యేది. ఆ తర్వతా మీడియా సంస్థలు పెరిగిపోయినై.. ప్రతి సంస్థకూ ఓ లోగోతో కూడిన ఓ మైక్ తప్పనిసరి అయ్యింది. ఆ మైకులన్నీ పెట్టేందుకు ఓ స్టాండ్.. ఇదీ తప్పనిసరి అయ్యింది. పోనీ.. ఇక్కడితో అయిపోయిందా.. అంటే అదీ లేదు.. ఇప్పుడు కొత్త నాయకుల ప్రెస్‌ మీట్లలో ప్రజంటేషన్ అనే ఓ కొత్త కోణం వచ్చి చేరింది.

ఇదేంటంటే.. రాజకీయ నాయకుడు అంటేనే విమర్శలకు ప్రాధాన్యం ఇస్తారు..అయితే ఆ విమర్శలకు సపోర్టింగ్ మెటీరియల్ కూడా ఉంటే.. ఆ ఆరోపణలు జనంలోకి బాగా బలంగా వెళ్తాయి.. జనంలో చర్చ జరుగుతుంది. తద్వారా ప్రెస్ మీట్ పెట్టిన ఫలితం లభిస్తుంది. అందుకే ఇప్పుడు నేతలంతా ప్రెస్ మీట్‌ తో పాటు ప్రజెంటేషన్ కూడా నేర్చుకుంటున్నారు. అలా ప్రజంటేషన్ ఇచ్చే విధంగా తమ కార్యాలయాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

చంద్రబాబు జగన్‌ను విమర్శించానుకుంటే.. జగన్ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తారు.. అలా ప్రస్తావించడం కామన్ కానీ.. ఇప్పుడు గతంలో జగన్ మాట్లాడిన బైట్ ప్రెస్ మీట్‌లో ప్రదర్శిస్తే.. అదో రకమైన సాధికారత వస్తుంది. వాదనకు బలం చేకూరుతుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇలాంటి వీడియోల ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం నోటి మాటగా చెబితే రిజిస్టర్ కావడం లేదని.. ఈ కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న బైట్లు, విజువల్స్, డాక్యుమెంట్లను విలేఖరులను ముందు ప్రదర్శిస్తూ.. తమ వాదనను బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదీ ఇప్పుడు కొత్త ట్రెండ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: