జగన్ ఫార్ములా: ఎవరైనా కాళ్ల దగ్గరికి రావాల్సిందే ?

Chakravarthi Kalyan
పరిపాలనలో ఒక్కో నేతకు ఒక్కో స్టయిల్ ఉంటుంది. ఏపీ సీఎం జగన్ మాత్రం కొత్త స్టయిల్ చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే.. ఆ విషయం సీఎం దృష్టికి వస్తే..  ఏదైనా సమస్య గురించి వస్తే.. సీఎం వారితో చర్చించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు.. ఇది ఎవరైనా చేస్తారు. కానీ.. ఏపీ సీఎం జగన్ రూటే సెపరేటు అంటున్నా విపక్ష నేతలు.. జగన్.. ఏం చేస్తారంటే.. అసలు ఏ సమస్యా లేని చోట.. కొత్త సమస్యను సృష్టిస్తారు.. ఆ సమస్య గురించి బాధితులు కిందా మీదా పడేలా చేస్తారు.

అప్పుడు సమస్య పరిష్కారం కోసం తన వద్దకు రప్పించుకుంటారు.. అప్పుడు చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించినట్టు చెప్పుకుంటారు.. ఇదీ జగన్ ఫార్ములా అంటున్నారు విపక్షాలకు చెందిన నాయకులు. జగనే సమస్య సృష్టిస్తారని.. మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్లు వ్యవహరిస్తుంటారని నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రతిపక్షనేత  చంద్రబాబు మాట్లాడుతూ... సినీ పరిశ్రమలో జగనే సమస్య సృష్టించారని.. మళ్లీ ఆయనే పరిష్కరిస్తున్నట్లు వ్యవహరించారని విమర్శించారు.

అసలు విషయం చెప్పాలంటే.. సినీ పరిశ్రమపై సీఎం జగన్ కక్షకట్టారని...  ఈవిషయం నిన్న సినీ నటుల మాటలతోనే అర్థమైందని చంద్రబాబు అంటున్నారు. సమస్యా తానే, పరిష్కారమూ తానే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారని.. అసలు రాజకీయాల్లో ఇలాంటి వాళ్లుంటారా..  ఇలా కూడా చేయవచ్చా అని తాను ఆలోచించలేదని చంద్రబాబు అంటున్నారు. ఇక ఈ విషయంలో టీడీపీ బాటలోనే జనసేన కూడా విమర్శిస్తోంది.

చిత్రసీమ సమస్యల పరిష్కారానికి సీఎం చూపిన మార్గం సక్రమంగా లేదంటున్నారు జనసేన నేత  నాదెండ్ల మనోహర్.. సినీ పరిశ్రమలోని ఇతర వర్గాలకు చెందినవారిని చర్చలకు పిలవాలని..
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నాదెండ్ల మనోహర్‌ సూచిస్తున్నారు. సినీ పరిశ్రమ మాదిరిగానే ఇతర అంశాలపైనా సీఎం దృష్టి పెట్టాలంటున్నారు. రాజధాని రైతులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నిస్తున్నారు సినీ హీరోలను పిలిచి మాట్లాడినట్లే రైతులను ఆహ్వానించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: