పొలిటికల్‌ బుల్లెట్‌: యోగీ ఆస్తుల జాబితాలో రివాల్వర్, రైఫిల్..?

Chakravarthi Kalyan
ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థులు తమ ఆస్తుల జాబితాను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.. ఇది రొటీన్‌ గా జరిగే ప్రక్రియే.. కానీ.. ఈ ఆస్తుల జాబితాను అఫిడవిట్ రూపంలో సమర్పిస్తారు కాబట్టి అది ప్రామాణికం, చట్టపరమైన పత్రంగా పరిగణిస్తారు. అందులో ఏమైనా తప్పులు చెబితే అదో పెద్ద న్యూస్ అవుతుంది. కోర్టుల్లోనూ దాన్ని సవాల్ చేయవచ్చు. అందుకే ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఆస్తులు ఎంత అన్నది ఈ అఫిడవిట్ల రూపంలో తెలుస్తుంటుంది.

అదే తరహాలో తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇటీవల తన ఆస్తుల జాబితాను ఈసీకి సమర్పించారు. విచిత్రం ఏంటంటే.. ఆ ఆస్తుల జాబితాలో ఉన్న అన్ని ఆస్తుల్లో కెల్లా రివాల్వర్, రైఫిల్‌ ఆసక్తికరంగా మారాయి. యోగి ఆదిత్యానాథ్ ఆస్తుల జాబితాలో లక్ష రూపాయల విలువైన ఓ రివాల్వర్ కూడా ఉంది. అలాగే మరో రైఫిల్‌ కూడా తనకు ఉన్నట్టు యోగి ఆదిత్యానాథ్ ఎన్నికల అఫిడవిట్‌లో తెలపడం ఆసక్తికరంగా మారింది.

యోగి ఆదిత్యానాథ్‌ సన్యాసి అన్న విషయం తెలిసిందే. మరి అలాంటి వ్యక్తికి రివాల్వర్‌ ఎందుకన్న వాదన వినిపిస్తోంది. అందులోనూ ఒకటి కాదు రెండు తుపాకులు యోగి వద్ద ఉన్నాయి. అయితే.. యోగి ఆదిత్యనాథ్‌ యూపీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రౌడీ షీటర్లు, గుండాలపై ఉక్కుపాదం మోపాడు.. అలాంటి వ్యక్తికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. అలాంటి వారి నుంచి రక్షణ కోసం ఇలాంటి ఆయుధాలు ఆయన సమకూర్చుకుని ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.

అసలే యూపీలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అసదుద్దీన్‌ ఒవైసీ కారుపైనా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇక యోగి ఆదిత్యానాథ్ మిగిలిన ఆస్తుల విషయానికి వస్తే.. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయట. ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌ కూడా ఉన్నట్టు యోగీ ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: