మంచు విష్ణు ఇక మోహన్ బాబును వదిలేస్తే బెటర్..?

Chakravarthi Kalyan
మంచు విష్ణు.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు.. అయితే ఈ ఎన్నిక ఈసారి గతంలో ఎన్నడూ కానంత వివాదాస్పదం అయ్యింది. ఈ పదవి కోసం ప్రకాశ్ రాజ్‌ వంటి జాతీయ స్థాయి నటుడు పోటీపడటం.. అందుకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడం.. అనూహ్యంగా యువ హీరోగా ఉన్న మంచు విష్ణు బరిలోకి రావడం.. అప్పటి వరకూ ప్రెసిడెంట్ పదవికి పోటీపడతామన్న జీవిత.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్లో పోటీ చేయడం.. ఎన్నికల ముందే ప్రకాశ్ రాజ్‌ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్‌ మధ్య హోరాహోరీ మాటల యుద్ధం.. ఆ తర్వాత ఇక పోలింగ్‌ రోజు జరిగిన హంగామా.. ఇలా.. ప్రతి విషయంలోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు జరిగాయి.

దీనికి తోడు మీడియా కూడా ఈసారి వివాదాల కారణంగా ఎక్కువ కవరేజ్ ఇచ్చింది. మొత్తానికి పట్టుమని వెయ్యి మంది ఓటర్లు లేని ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్ష స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ఫైనల్‌గా విష్ణు మా అధ్యక్షుడు అయ్యారు. దీంతో ఎవరు కాదన్నా.. అవునన్నా.. ఎవరికి ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. ఆయన రెండేళ్లు మా అధ్యక్షుడిగా ఉంటారు. అయితే మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిరోజే మంచు విష్ణు చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పం అయ్యాయి. దీంతో ఆగ్రహించిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ రాజీనామాలు చేసింది.
ఈ వివాదాలు అటుంచితే.. మా అధ్యక్షుడు అయ్యాక కూడా మంచు విష్ణు ఇంకా తండ్రి మోహన్ బాబు జపం చేస్తున్నాడన్న విమర్శ వినిపిస్తోంది. ఎన్నికల ముందు వరకూ ఓకే.. ఎన్నికల పోలింగ్ రోజు చేసిన హడావిడీ ఓకే.. కానీ.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి.. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇంకా మంచు విష్ణు ఇదే తరహాలో తండ్రి మోహన్ బాబు భజన చేస్తూ ఉంటే.. ఇక సొంతగా నాయకుడిగా తన ముద్ర చూపించే అవకాశం కోల్పోతాడు.

మంచు విష్ణును సీట్లో కూర్చోబెట్టి మోహన్ బాబు, నరేశ్ అధికారం చెలాయిస్తున్నారన్న పేరు మంచు విష్ణు తెచ్చుకుంటే అది ఆయనకు బాగా మైనస్ పాయింట్ అవుతుంది. ఈవిషయాన్ని మంచు విష్ణు గ్రహిస్తే మంచిది. ఇకనైనా మంచు విష్ణు తనదంటూ ఓ సొంత ముద్ర చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: