ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

Chakravarthi Kalyan
టోక్యో ఒలింపిక్స్‌ ఇండియాకు నిరాశనే మిగులుస్తున్నాయి. వ్యక్తిగత హోదాలో ఒక్క స్వర్ణం కూడా వచ్చే అవకాశం లేదు.. చిన్న చిన్న దేశాలు సైతం పతకాల పట్టికలో దూసుకుపోతుంటే.. ఇండియా మాత్రం నేల చూపులు చూస్తోంది. అయితే ఈ టోక్యో ఒలింపిక్స్ మాత్రం అమ్మాయిలే బంగారాలని మరోసారి రుజువు చేశాయి. అవును.. ఇప్పటి వరకూ టోక్యో ఒలింపిక్స్‌లో మెరుపులు మెరిపించిందంతా అమ్మాయిలే కదా.

ఒలింపిక్ పతకాల వేటలో మొత్తం దాదాపు 128 మంది వరకూ క్రీడాకారులు ఇండియా నుంచి టోక్యో వెళ్లారు. అయితే ఇండియాను గర్వపడేలా చేసింది మాత్రం చాలా వరకూ అమ్మాయిలే.. దేశానికి ఈ ఒలింపిక్స్‌లో మొదటి పతకం సాధించి పెట్టింది మీరాబాయి చాను. బాక్సింగ్‌లో రజత పతకం సాధించిందామె. ఇక ఆ తర్వాత స్వర్ణం సాధింస్తుందనుకున్న తెలుగు తేజం సింధు ఆ స్థాయిలో ఆడలేకపోయినా.. కాంస్యమైనా సాధించి భారత పరువు నిలబెట్టింది.

రెజ్లింగ్‌లో మరో అమ్మాయి లవ్లీనా.. పతకం ఖాయం చేసుకుంది. ఇక హాకీలో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. మొట్టమొదటిసారి హాకీ నుంచి సెమీస్‌లో అడుగు పెట్టారు. గత ఏడాది స్వర్ణ పతక విజేత ఆస్ట్రేలియాను సైతం కట్టడి చేశారు. డిస్కస్‌త్రోలో మరో అమ్మాయి కమల్‌ ప్రీత్‌ కౌల్ పతకం సాధించలేకపోయినా తన ప్రతిభతో ఆకట్టుకుంది. డిస్కస్‌త్రో ఫైనల్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళగా రికార్టు సృష్టించింది.

ఇంకా దీపికా వంటి ఆర్చర్లు కాస్త నిరాశపరిచారు. అయితే మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకూ భారత్ తరపున అత్యంత ప్రతిభ చూపించింది మాత్రం అమ్మాయిలే. ఆడపిల్ల అంటే చిన్నచూపు చూసే మన దేశంలో ఇప్పుడు అమ్మాయిలే బంగారం అని మరోసారి రుజువు చేశారు. స్త్రీని దేవతగా పూజిస్తేనో.. కాళ్లకింద నలిపేసే మగమహానుభావులున్న దేశం మనది. అలాంటి వారికి కనువిప్పు మన ఒలింపిక్‌ బంగారాలు.. ఆడాళ్లూ మీకు మరోసారి జోహార్లు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: