హెరాల్డ్ సెటైర్ : ఇంతకీ బోడిలింగం ఎవరో తేలిపోయిందా ?

Vijaya
రాష్ట్రంలో ఏదో ఓ వివాదం లేకపోతే రాజకీయ జనాలకు నిద్రపట్టదు. తాజాగా బోడిలింగాల గొడవ మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ లింగాల వివాదాన్ని మొదలుపెట్టారు. నివర్ తుపాను కారణంగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తో పవన్ కృష్ణా జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చే ప్లానుతో జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఉయ్యూరు, గుడివాడలో పెద్ద రోడ్డు షో నిర్వహించారు. గుడివాడలో మాట్లాడుతు కావాలనే మంత్రి కొడాలినానిని టార్గెట్ చేశారు. కొడాలి గురించి మాట్లాడుతు ఎవరయ్యా నాని అంటు ఎగతాళిగా ప్రశ్నించారు. ఎవరయ్యా నాని అనగానే ఎవరో కొడాలి నాని అంటు చెప్పారు. దాంతో ‘నానీనో ఎవరు ఎంతమంది నానీనలను గుర్తు పెట్టుకుంటాం.. శతకోటి లింగాల్లో ఓ బోడిలింగం’ అంటూ కొడాలి గురించి ఎగతాళిగా మాట్లాడారు.



దానికి కౌంటరుగా కొడాలి మాట్లాడుతూ ‘శివలింగం ఎవరో బోడిలింగం ఎవరో మొన్నటి ఎన్నికల్లో జనాలు తేల్చి చెప్పినా ఈయనకు(పవన్) ఇంకా బుద్ధిరాలేదం’టూ మండిపోయారు. 151 సీట్లతో అఖండ మెజారిటితో గెలిచిన జగన్ను జనాలు శివలింగం లాగ పవిత్రంగా చూసుకుంటున్నారని చెప్పారు. ఇదే సమయంలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయినే పవనే బోడిలింగమని తేలిపోయింది కదా ? అంటు కొడాలి ఎదురు ప్రశ్నించారు. వైసీపీని శివలింగం అనుకోబట్టే జనాలు జగన్ కు అఖండ మెజారిటి కట్టబెట్టిన విషయం పవన్ కు తెలీదా అన్నారు. పవన్ను జనాలు బోడిలింగం అనుకోబట్టే రెండుచోట్లా ఓడగొట్టిన విషయం అందరు చూసిందే అన్నారు. ఇంకా క్లారిటి కావాలంటే భీమవరం లేకపోతే గాజువాకకు వెళ్ళి అడిగితే బోడిలింగం ఎవరో జనలు చెప్పేస్తారంటూ పవన్ కు ఫుల్లుగా కొడాలి వాతలు పెట్టేశారు.



ఇదే సమయంలో సినిమాలు, వ్యాపారాల్లో మానుకోవటం గురించి కూడా కొడాలి క్లారిటి ఇచ్చేశారు. అసలు పవన్ను సినిమాలు మానుకోమని ఎవరడిగారు ? ఇపుడు సినిమాలు చేసుకోమని ఎవరు చెప్పారు ? అంటూ నిలదీశారు. సినామాల్లో మానేస్తానని ప్రకటించింది పవనే..మళ్ళీ నటిస్తున్నదీ పవనే కదా కదా అంటు అడిగారు. పవన్ రాజకీయాల్లో ఉంటే ఏమిటి ? మానుకుంటే ఏమిటి ? అని గాలితీసేశారు. రైతులకు నష్టపరిహారం క్రింద రూ. 35 వేలు ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామన్న పవన్ హెచ్చరికపై మాట్లాడుతూ చేతనైనది చేసుకోమంటు సవాలు విసిరారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నది ఎవరో, ప్యాకేజీ కోసమని పనిచేస్తున్నదెవరో జనాలకు బాగా తెలుసంటు ఎద్దేవా చేశారు. మొత్తం మీద కొడాలి సమాధానంతో శివలింగం ఎవరో బోడిలింగం ఎవరో జనాలకు ఫుల్లు క్లారిటి వచ్చినట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: