హెరాల్డ్ సెటైర్ : కామిడి అయిపోయిన వీర్రాజు ప్రకటనలు..అధికారం బీజేపీదేనట

Vijaya
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడే మాటలు ఒక్కోసారి మరీ క్యామిడిగా ఉంటున్నాయి. శ్రీకాళహస్తిలో పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతుల సందర్భంగా వీర్రాజు మీడియా మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పటంతో జనాలందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. వీర్రాజు లాంటి వాళ్ళ ప్రకటనలు క్యామిడి సినిమా చూస్తున్నట్లుగా ఉందని జనాలు తెగ నవ్వుకుంటున్నారు. లేకపోతే బీజేపీ ఏమిటి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయటమేంటో ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపి ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది ముందు వీర్రాజు తెలుసుకుంటే బుగుంటుంది. తర్వాత పోటీ చేసిన వాళ్ళలో ఎంతమందికి డిపాజట్లు వచ్చాయన్నది వేరే విషయం.



175 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి  చాలా చోట్ల  గట్టి అభ్యర్ధులే దొరకలేదు. కనీసం ఒక్క అభ్యర్ధి కూడా ప్రత్యర్ధులకు గట్టి పోటి ఇవ్వలేకపోయాడు. ఎంపి ఎన్నికల్లో అయితే పోటీ చేసిన వాళ్ళల్లో చాలమందికి అసలు డిపాజిట్లు కూడా దక్కలేదు. హోలు మొత్తం మీద పార్టీకి మొత్తంమీద వచ్చిన ఓట్ల శాతం 0.84. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా) కు కూడా 3 శాతం ఓట్లొచ్చాయంటే బీజేపీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. అప్పటికి ఇప్పటికి పార్టీ పరిస్ధితిలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పవచ్చు.  కేంద్రంలో బలంగా ఉందనో లేకపోతే ఉత్తరాధి రాష్ట్రాల్లో అధికారంలో ఉందనో అనుకుని ఏపిలో కూడా అధికారంలోకి వచ్చేస్తామని వీర్రాజు రెచ్చిపోవటమే విచిత్రంగా ఉంది.  ఏదో తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన ఏపిలో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేయటానికి మించిన క్యామిడి ఏముంటుంది ?



అసలు ప్రస్తుతం బీజేపీలో ఉన్ననేతలు గట్టి నేతలు ఎంతమంది ఉన్నారో వీర్రాజు లెక్కేసి చెబితే చాలు. గట్టి నేతలంటే నామినేషన్ వేయగానే గెలుస్తారని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్ధులకు గట్టిపోటి ఇచ్చి గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకునే స్ధాయి నేతలు ఎంతమంది ఉన్నారన్నదే అసలైన ప్రశ్న.  ఇప్పటికైతే అటువంటి నేతలు టార్చిలైట్ వేసినా ఎక్కడా కనబడటం లేదు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి కమలం కండువా కప్పుకున్నారు. కానీ బీజేపీలో చేరిన దగ్గర నుండి మళ్ళీ ఇంతవరకు ఎక్కడా కనబడలేదు. సూరి అసలు బీజేపీలోనే ఉన్నారా ? ఉంటే ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటం లేదనే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళే కనబడటం లేదు.



ఇక కడపలో మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి కూడా టీడీపీ నుండి వచ్చేసి  బీజేపీలో చేరారు. ఈయనగారు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున కడప ఎంపిగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లొచ్చింది అందరు చూసిందే. టీడీపీకి భవిష్యత్తు లేదని బీజేపీలో చేరారు. కానీ ఈయన బీజేపీలో ఉన్నా ఒకటే టీడీపీలో ఉన్నా ఒకటే అన్నట్లుగా తయారైందట పరిస్ధితి. సో హోలు మొత్తం మీద కమలం నేతల్లో చాలామంది పరిస్ధితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఇటువంటి వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేయిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని కలలు కంటున్నారు. నిజానికి వీర్రాజుకు కూడా తెలుసు తన స్టేట్మెంట్ చాలా క్యామిడిగా ఉంటుందని. ఏదో తెలంగాణా దుబ్బాక లో పార్టీ గెలిచింది కాబట్టి ఏపిలో కూడా ఓ ప్రకటన పడేస్తే పోలా అన్నట్లుంది వీర్రాజుగారి యవ్వారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: