మంచిమాట: సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి పనినైనా సులభంగా చేయవచ్చు..!!

Divya
మీర్జాపురాన్ని కృష్ణకుమారుడనే రాజు పాలించేవాడు . అతడు ఏ పనిని సాధ్యమా కాదా అని ఆలోచించకుండానే తనకు తోచిన విధంగా మంత్రులకు, భటులకు ఆజ్ఞలు జారీ చేసేవాడు. ఎవరికైనా రాజాజ్ఞ అసాధ్యం అని చెబితే వారు పదవి నుంచి తప్పుకోవాల్సిన దేనని ఆశించేవాడు. అప్పటికే చాలామంది తమ పదవులు పోగొట్టుకున్నారు.ఓసారి కొత్తగా చేరిన మంత్రిని పిలిచి తనకు ఆకుపచ్చరంగు పిల్లి కావాలని అడిగాడు రాజు. అలాంటి పిల్లిని తీసుకురావటం సాధ్యం కాదంటే.... ఏమౌతుందో మంత్రికి తెలుసు.. అందుకని ఓ పిల్లిని ఆకుపచ్చరంగు వేసి రాజు దగ్గరికి తెచ్చాడు. దానికి రాజు మంత్రిని మెచ్చుకున్నాడు.
 
ఓ రోజు ఉదయమే మంత్రి గారికి రాజా వారి నుంచి కబురు తెచ్చాడు. ఓ భటుడు.. మామిడి పండ్లు తీసుకు రావాలని రాజుగారి ఆజ్ఞ.. చెప్పాడా భటుడు
వర్షాకాలంలో మామిడి పండ్లు ఉండవు.. లేవని చెబితే రాజుగారికి కోపం పెద్ద చిక్కే వచ్చింది. అనుకుంటూ విచారంగా కూర్చున్నాడు మంత్రి ..అందులో మంత్రి కుమారుడు తండ్రి దిగులుగా ఉండటాన్ని చూసి ఎందుకు అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. విషయం చెప్పాడు తండ్రి ..కాసేపు ఆలోచించిన మంత్రి కుమారుడునాన్న నువ్వు ఇంటి దగ్గరే ఉండు రాజుగారికి మామిడి పండ్లు నేను తీసుకెళ్తాను అని బయలుదేరాడు.
 
మంత్రి కుమారుడు రాజు దగ్గరికి వెళ్లి... మామిడి పండ్ల కోసం వెళ్ళిన తన తండ్రి వడదెబ్బ తగిలి మూర్చపోయాడు.  ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పాడు..ఇది వర్షాకాలం అసలు ఎండలే లేవు మీ తండ్రికి వడదెబ్బ తగలడం అసాధ్యం నువ్వు చెబుతున్నది అబద్ధం కోపంగా అన్నాడు రాజు
అవును రాజా మీరు చెప్పింది నిజమే వర్షాకాలంలో ఎండలు ఉండవు. అలాగే మామిడి పండ్లు కూడా ఉండవు. అవి వేసవిలో వచ్చే పండ్లును మీరిప్పుడు కావాలంటున్నారు. వాటిని తేవటం మాత్రం అసాధ్యం కూడా వినయంగానే అడిగాడు మంత్రికొడుకు.. ఆ జవాబు రాజుని ఆలోచింపజేసింది శభాష్.. మొదటిసారి తెలివైన సమాధానం ఇచ్చిన వాన్ని చూశాను అని మంత్రి కుమారున్ని మెచ్చుకున్నాడు.
 
అంతేకాదు రాకుమారుడితో సమానంగా విద్యల్లో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేసి భవిష్యత్తులో మంత్రిని చేసేందుకు నిశ్చయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: