మంచిమాట: మనది కానిది ఎన్నటికీ మనది కాదు..!!

Divya
కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో లక్ష్మి అనే పేరు గల ఒక ఆవిడ ఉండేది. ఆవిడకు రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు ఉండేది. రోజూ అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మి గారికి కొద్ది రోజులకి ఏర్పడింది.
అలాగే ఒక రోజు పార్కు లోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పద్ధతిలో తన బెంచికి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని ఉన్నాడు. రుసరుసలాడుతూ తన శాలువా, పర్సు తో పాటూ  తెచుకున్న ఇతర సామాన్లు చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.
చదువుతూ పక్కన ఉన్న వేరుశనగలు అందుకని వొలుచుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోనుంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. ఎంత పొగరు అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశం ఇలా ఉంది. అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమీ అనలేక అలాగే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తాడో అని లక్ష్మిగారు కూడా పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకొని. తినేసింది. అన్ని అయిపోయి ఒక్క వేరుశనగ మిగిలింది. పెద్దాయన చిరునవ్వుతో "ఇది మీరు తీసుకోండి"అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి పోయారు.
లక్ష్మీ గారు "వేరుశనగ దొంగ!"అని చికాకుగా అనుకుంది.

లేచి తన సామాను బెంచీమీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దగ్గరే కనిపించింది.
"అయ్యో !ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం ఆయన్ని ఎన్ని మాటలు అనుకున్నానో! అని చాలా బాధపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: