మంచిమాట: అత్యాశ వల్ల ఎప్పటికైనా తిప్పలు తప్పవు..!!

Divya
ఒక ఊరిలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు ,గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తుంటేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళుతూ ఉండేవి .అవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకి కట్టాడు. వాటిని మేతకు వదిలేసి గోవిందుడు కట్టెలు కొడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్ళించే వాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించే వాడు గోవిందుడు..

ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది.
ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆవును ఎలాగైనా దొంగలించాలి అని అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరకు వెళ్లి "ఆవు మెడలో గంట ఎంతో బాగుంది. నాకు అమ్ముతావా.. నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను. అని అడిగాడు. వీడెవడు వెర్రి వాడిలా ఉన్నాడు. ఉత్తి గంటకు డబ్బులు ఎక్కువ ఇస్తానంటున్నాడు. అని మనసులో నవ్వుకొని సరే అన్నాడు గోవిందుడు.

ఆ వ్యక్తి  గంట తీసుకొని డబ్బులు ఇచ్చి తన ఇంటికి వెళ్ళాడు. ఆ మరునాడు గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి రానే వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప మిగతా ఆవులు అన్నీ కనిపించాయి. గంట లేకపోవటం వల్లే ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు గోవిందుడి కి. ఆ ఆవు కనిపించకపోవటంతో ఎంతో బాధపడ్డాడు గోవిందుడు.. ఆ గంట కొన్న వాడే ఆవును దొంగలించి ఉంటాడని గ్రహించలేక పోయాడు. అయ్యో గంట ఉంటే బాగుండేది అని బాధపడ్డాడు గోవిందుడు. కాబట్టి ఎవరైనా సరే అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా అలాగే పోతుంది అని గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: