మంచిమాట: మనిషి చేసిన తప్పులను క్షమించి.. పొందిన సహాయాన్ని కలకాలం గుర్తుంచుకోవాలి..!!

Divya
అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు వుండేవారు.. వారు సెలవు రోజున ఊరు వెలుపలకి షికారుకు వెళ్లారు. దారిలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై ఇద్దరి మధ్య అభిప్రాయం కుదరక వాదించుకున్నారు.. వాదన ఎక్కువై కోపం తట్టుకోలేక మొదటివాడు రెండోవాడిని చెంపపై కొట్టాడు. అయితే దెబ్బతిన్న వాడు అక్కడ ఉన్న ఇసుక పై.." ఈ రోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు " అని రాశాడు. ఇక మళ్లీ ఇద్దరూ కలిసి ముందుకు నడిచారు.
ఇక మరి కొంత దూరం వెళ్ళాక.. ఇద్దరికీ దాహం వేసి, ఒక మడుగు దగ్గరకు వెళ్లారు. ఇక చెంప దెబ్బ తిన్న మిత్రుడు ముందు నీళ్ళలోకి దిగి ,నీళ్లు తాగాలని ప్రయత్నించాడు. అక్కడ ఊబి ఉండడం కారణంగా మొదటి మిత్రుడు వెంటనే తన ప్యాంటుని విప్పి, మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు. ఆ ఊబి నుంచి బయటపడ్డాక రెండవ వాడు.. ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు.
ఇక మొదటి విషయాన్ని ఇసుకపై , రెండో విషయాన్ని రాయిపై ఎందుకు రాశారని మిత్రుడు అడగ్గా.. ఇసుక మీద రాసిన ఏదైనా సరే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది.. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకో కూడదు కాబట్టే ఇసుక మీద అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుండి పోవాలి కాబట్టి అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు. ఇక ఈ విషయాన్ని గ్రహించిన మొదటి మిత్రుడు తన కోపాన్ని తగ్గించుకుని తన మిత్రునితో చాలా సంతోషంగా తన జీవితాన్ని కొనసాగించాడు..
ఇక స్నేహితులే కాదు.. ఎవరు తప్పు చేసినా సరే, క్షమించి మరిచిపోవాలి తప్ప.. దానిని గుర్తు పెట్టుకో కూడదు.. అదే సహాయం చేసిన వారిని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. ఈ రెండు విషయాలను మనసులో పెట్టుకుంటే , చిరకాలం సంతోషంగా ఉండగలగుతాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: