మంచిమాట: ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను కనబరిచినప్పుడే తెలివితేటలు బయటపడతాయి..!!

Divya
కోసల దేశానికి మహా మంత్రిగా ఉన్న సుబుద్ధి దురదృష్టవశాత్తు చనిపోతే, ఆ పదవిని అతడి కుమారుడికి అప్పగించాడు మహారాజు. పదవి అయితే ఇచ్చారు కానీ అతడు తెలివితేటలు ఏపాటివో పరీక్షించాలి అని అనుకున్నాడు మహారాజు. అయితే ఒకరోజు కొత్త మంత్రిని పిలిచి రాజదర్బారులో ముఖ్యమైన విభాగానికి ఒక అధికారిని నియమించాల్సి ఉంది. అతడు చాలా నిజాయితీ పరుడై ఉండాలి. ఇప్పటివరకు ఇలాంటి సందర్భం ఏదైనా ఎదురైనప్పుడు మీ నాన్నగారు తగిన ఉపాయంతో ఉద్యోగులను నియమించేవారు. ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు రాజు..
ఇక మహా మంత్రి కొడుకు మాట్లాడుతూ.. మహా ప్రభు..! ఆ బాధ్యత నాకు వదిలేసి చాటింపూ వేయించండి అన్నాడు.. ఆ చాటింపు విని 10 మంది నిరుద్యోగులు కోటకి వచ్చారు. మంత్రి వాళ్ళతో రాజు గారి దగ్గరకు తీసుకెళ్లడానికి ముందు ఒక చీకటి గదిలో నుంచి పంపించాడు. ఆ తర్వాత రాజు గారు చుట్టూ పది సార్లు పరిగెత్తాలి అని చెప్పాడు. ఒక వ్యక్తి తప్ప మిగతా వారంతా కాళ్ళు నొప్పి , కడుపు నొప్పి అంటూ కుంటిసాకులు చెబుతూ పరిగెత్తడానికి నిరాకరించారు.
మంత్రి ఆ ఒక్కడిని రాజుకు చూపించి రాజా వీళ్లలో ఇతడొకడే నిజాయితీపరుడు అని చెప్పాడు.. రాజు ఆశ్చర్యంతో ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు.. దానికి మంత్రి నవ్వుతూ.. ఏమీ లేదు మహారాజా.. వీళ్ళను ముందు బంగారు నాణేలు రాసులుగా పోసి, ఒక చీకటి గదిలో నుంచి పంపించాను.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు..ఈ తొమ్మిది మంది వారి దుస్తుల్లో బంగారు నాణేలను దాచుకున్నారు. ఇప్పుడా దొంగతనం బయటపడి పోతుందని భయపడే పరిగెత్తడానికి నిరాకరించారు అని చెప్పాడు. ఇక మంత్రి తెలివిని ప్రశంసించిన రాజు అతడు సూచించిన వ్యక్తిని విధుల్లోకి తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను కనబరిచినప్పుడే తెలివితేటలు బయటపడతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: