మంచిమాట: బద్ధకం మనిషి ప్రాణాలనే తీస్తుంది.!!
ఒక పెద్ద దుంపలు మన కొలను ప్రాంతంలోనే దాచి పెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది. దానికి కుందేలూ, జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలుకాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా... ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే. అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటాను అని ఓ చెట్టు వద్ద కూర్చుండి పోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టునూ, తుప్పనూ, బండనూ వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప ఆ జింక కూర్చున్న చెట్టు తొర్ర లోనే ఉంది! జంతువులన్నీ విజేత అని ప్రకటించాయి..
ఆ తర్వాత కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని అడవిలో ఉన్న జంతువులన్నీ మెచ్చుకున్నాయి. అయ్యో... పక్కనే ఉన్నా..నా బద్దకంతో చూడక ఓడిపోయానే అని బాధపడింది జింక.. అప్పటినుంచి తన పద్ధతి మార్చుకుంది. బద్ధకం వల్ల జీవితంలో ఏదీ సాధించలేము. ఎప్పుడైతే మనం బద్ధకం వీడి చురుకుగా పని చేస్తామో.. ఎంతటి కష్టమైన పనే అయినా సరే సులభంగా పూర్తవుతుంది. ప్రతి ఒక్కరు నిత్యం చురుకుగా ఉండడానికి ప్రయత్నం చేయండి.