మంచిమాట: సంకల్పబలం గట్టిదైతే అంతా మంచే జరుగుతుంది..!!
తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదల ఆకలి తీర్చాలని అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. రామయ్య.. రోజుకు కనీసం వంద మంది దాకా ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. తాను కూడా అన్నలా అన్న దానం చేయాలని సోమయ్య అనుకొని వ్యవసాయం చేయటానికి ప్రయత్నించాడు. కానీ పొలంలో ధాన్యం చాలా తక్కువగా పండింది తన భార్య పిల్లలకు ఆ దాన్యం సరిపోతాయి. అన్న లాగే తాను వ్యవసాయం చేసినా... ధాన్యం అలా ఎందుకు పండలేదో అర్థం కాలేదు. అన్నను అడగాలంటే సోమయ్యకు అహం అడ్డొచ్చింది తన బంధువులంతా అన్నయ్య ఇంటికే వెళ్తూ అక్కడే బస చేస్తున్నారు.
తిరిగి తమ ఊర్లకు వెళ్ళినప్పుడే తనను చూసి వెళ్తున్నారు.. ఇది తనకు అవమానంగా భావించాడు సోమయ్య. చివరకు తన అన్ననే ఈ విషయం అడగాలని వెళ్ళాడు.. తన అన్నతో అన్న..! నేను కూడా దానం చేస్తానని అందుకు ఏం చేయాలో చెప్పాలని అని అడిగాడు. ఇంతలో రహస్యం ఏమీ లేదు తమ్ముడు నేను పోటీ కోసం అన్నదానం చేయాలని అనుకోలేదు. తప్పు దారి లో నడుస్తున్న నిన్ను మార్చాలన్న మంచి నిర్ణయమే తీసుకున్నాను. నేను ఏది చేసినా నువ్వు చేస్తావని తెలుసు. అందుకే నీ వద్ద దాన్యం లేవని తెలుసుకుని అన్నదానం ప్రారంభించాను.
దేవుని కృప నా పట్ల ఉందో ఏమో.. పొలంలో వేసిన విత్తనాలు నాలుగైదు రేట్లు పండాయి. నువ్వు నా పై పోటీ తోనే అన్న దానం చేయాలని అనుకున్నావు. స్వతహాగా నీకు ఆలోచన లేదు..మన ఆలోచన మంచిదైతే మంచి జరుగుతుంది. దైవం కూడా సహాయం చేస్తాడు..ఇప్పటికైనా నీలో మార్పు వస్తే అంతే చాలు అంటూ బుద్ధి చెప్పాడు. సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుందని గ్రహించాడు తమ్ముడు. అప్పటి నుండి పోటీ పడటం మానేశాడు సోమయ్య. పది గేదెలను కొని.. పాలు, పెరుగు దానం చేయడం మొదలుపెట్టాడు. అన్న చెప్పినట్లే మంచి నిర్ణయం తీసుకున్నందుకు వల్ల గేదెలు పాలు ఎక్కువగా ఇచ్చేవి. రామయ్య లా సోమయ్య కూడా ప్రజలకు దగ్గరయ్యాడు. తమ్ముడి మార్పుకు రామయ్య సంతోషించాడు.