మంచిమాట: ధైర్యం ముందు ఎట్టి పరిస్థితులు అయినా తలవంచాల్సిందే..!

Divya
అనగనగా ఒక ఊరి వుండేది. ఆ వూరి పేరు ఆనందపురం..ఆ ఆనందపురం అనే వీరిని వివేకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకసారి వివేకుడు తన కుమారుడు విక్రముడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని తన ఆస్థానంలో ఉన్న మంత్రులతో చెబుతూ... 'ధైర్యవంతుడూ. తెలివైనవాడూ, అందగాడూ అయిన విక్రముడికి సుగుణాల రాశిని ఎక్కడున్నా వెతకాలి అన్నాడు.
వెంటనే రాజ్యమంతా ఆ మంత్రులు చాటింపు వేయించారు.విక్రముడిని వివాహం చేసుకోవడానికి  ఎవరైనా ముందుకు రావచ్చు. కాకపోతే... ఒక షరతు వాళ్లు మా దగ్గరున్న అద్భుత అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి. ఎవరి హృదయం అయితే దురాలోచనలతో ఉంటుందో.. వాళ్లు మా అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి. వారు అర్హులు కారు అని చెప్పారు.

ఇలా చాలా మంది అమ్మాయిలకి యువరాజును పెళ్లాడాలని ఉన్నప్పటికీ 'ఒక వేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే'... అని భయపడి ముందుకు రాలేదు. అలా కొన్ని వారాలు వృథాగా  గడిచిపోయాయి.
ఒకసారి ఒక  పల్లెటూరి అమ్మాయి తన తండ్రితో నగరానికి వచ్చి , మంత్రుల్ని సంప్రదించింది. వారు సభను  కూడా ఏర్పాటు చేశారు. 'నిబంధన తెలుసు కదా'! అన్నాడు రాజు. అందుకు బదులిస్తూ ఆ అమ్మాయి..రాజా..! తప్పులు చేయనిది ఎవరు... అందుకు నేను మినహాయింపు కాదు. తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన..నన్ను ఊర్లో ఎవరూ కూడా దూరం పెట్టలేదు. నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటు సరిదిద్దుతాను. నాకు యువరాణి అవ్వాలన్నా తాపత్రయమేమి లేదు. కానీ అద్దంలో చూడటానికి నాకు ఎలాంటి భయమూ లేదు. అంటూ అర్థం తీసుకొని అద్దంలో చూసింది. ఎలాంటి మచ్చలు కనిపించలేదు. ఆ వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలూ అద్దంలో చూసుకున్నా రు. వాళ్లకి మచ్చలు కనిపించలేదు.

వెంటనే రాజు కలగజేసుకుని.... ఇది సాధారణ అద్దమే. కానీ మీరెవరు ఈమెలా ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు. అలా వచ్చింది కాబట్టి ఈమె యువరాణి కాబోతోంది అని ప్రకటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: