మంచి మాట:కలిసి ఉంటే కలదు సుఖం...!

Sravani Manne
అనగనగా ఒక ఊరిలో మాధవ్,గోవింద్,రఘు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు.వారు ఒకసారి పెళ్ళికి మరో ఊరికి బయలుదేరారు.అక్కడికి బయలుదేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి.నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టారు.నడిచినడిచి బాగా ఆకలి వేయటంతో వారి దగ్గరున్న ఆహార పదార్దాలు కొంచెం కొంచెం తినడం ప్రారంబించారు.అలా తినడం వల్ల వాళ్లు తెచ్చుకున్న ఆహార పదార్దాలు అన్ని అయిపోయాయి.దాంతో ఆ ముగ్గురు"రేపు మధ్యాహ్నం కానీ పెళ్ళికి చేరుకోలేoఅప్పటి వరకు ఏమి తినాలి"అని ఆలోచింపసాగారు.అంతలో వారికి బాగా పండిన పనస పండు వేలాడుతూ కన్పించింది.గబగబ వెళ్ళి ముగ్గురు కలిసి పండుని కోశారు.పనస పండును ముందు నేను చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి అని మాధవ్ అన్నాడు.

"ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వడం సబబు"అని గోవింద్ అన్నాడు.ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు.చివరికి కొట్టుకొనే వరకు వచ్చింది.అప్పుడు రఘు వారిద్దరిని ఆపి"చీకటి పడుతుంది.రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయమే లేచి వెళదాం.ఎవరికి ఎక్కువ ఇవ్వాలని దేవుడు నిర్ణయిస్తాడు"అని సర్ది చెప్పాడు.మర్నాడు ఉదయం మాధవ్,గోవింద్లు త్వరగా నిద్ర లేచారు."దేవుడు నా కలలో కన్పించి,నన్నే పెద్ద వాటా తీసుకోమని  చెప్పాడు" అని గోవింద్ అన్నాడు. లేదు లేదు ."దేవుడు నా కలలో కన్పించి,నన్నే పెద్ద వాటా తీసుకోమని  చెప్పాడు" అని మాధవ్ అన్నాడు.ఇలా వీళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికి రఘు లేవలేదు.మాధవ్,గోవింద్లు కలిసి రఘుని తట్టి నిద్ర లేపారు."ఎoదుకు ఇంతసేపు పడుకున్నావు"ఇద్దరూ కలిసి రఘునిఅడిగారు.అప్పుడు రఘు"నేను దేవుడి మాట కాదనలేకపోయాను,అందుకే ఇంతసేపు నిద్ర పోయాను.రాత్రి నాకు దేవుడు కనిపించి పనసపoడును నన్ను ఒక్కడినే తినేయమని చెప్పాడు.కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవడం వలన త్వరగా మెలుకవ రాలేదు" అన్నాడు.

"ఎంత దేవుడు చేస్తే మాత్రం నువోక్కడివే మొత్తం తినేస్తానా,మా కోసం చెరో నాల్గు పనస తోనలైన ఉంచలేకపోయవా?"అని రఘుని తిట్టారు.ఎక్కువ కావాలని ఆశ పడినoదుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధ పడ్డారు.ఈ సారి ఏది అయిన దొరికితే  ఎక్కువ  వాటాల కోసం దెబ్బలాడు కోకుండా సమానంగా పంచుకొనే బాగుంటుంది అనుకున్నారు.అప్పుడు రఘు "బాధపడకండి,పనస పండును నేను తినలేదు,మీరు దేబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అలా చెప్పాను"అని అన్నాడు.చెట్టు చాటున దాచిన పనసపండు తేసుకోచ్కాడు.దాన్ని ముగ్గురు కలిసి సమానంగా పంచుకొని తిన్నారు.హుషారుగా నడుచుకుంటూ పెళ్ళికి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: