మంచిమాట : అన్నం తినేటప్పుడు.. ఈ తప్పులను ఎప్పుడైనా గమనించారా..?

Divya
అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం.. సాక్షాత్తు అన్నపూర్ణాదేవినే అన్నంగా పూజిస్తారు అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే అన్నం వడ్డించేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఒక్క మెతుకు కూడా కిందపడ వేయకూడదు.. అనే సంప్రదాయం.. మన భారత హిందూ సంప్రదాయం.. మనలో చాలామంది తెలిసీ తెలియక అన్నం తినేటప్పుడు లేదా వడ్డించేటప్పుడు కొన్ని తప్పులను చేస్తున్నారు.. అవేంటో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి..

1. వంట వండేటప్పుడు తప్పకుండా స్నానం చేయాలి. ఎందుకంటే రాత్రి మన శరీరం మీద క్రిములు చేరటం వల్ల.. అవి మన దుస్తుల నుంచి వంటలకు వ్యాపించడం జరుగుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వంట వండేటప్పుడు తప్పకుండా స్నానం చేసి వంట వండాలి.

2. మరికొంతమంది చెప్పులు ధరించి , ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
3. ఇక భోజనానికి ముందు..భోజనానికి తర్వాత తప్పకుండా కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవాలి.
4. భోజనం చేసేటప్పుడు తూర్పు, ఉత్తర దిక్కుకు కూర్చుని భోజనం చేయడం మంచిది.
5. భోజనం లేదా ఇతర ఆహార పదార్థాలను కంచంలో వడ్డించేటప్పుడు, కంచానికి తాకకుండా వడ్డించాలి. ఒకవేళ కంచానికి తాకుతూ ఆహార పదార్థాలు వడ్డించడం వల్ల.. అది ఎంగిలి అవుతుంది.  ఇలా ఎంగిలి పదార్థాలను ఇతరులకు వడ్డించే లేము కదా..
6. ఆహారాన్ని నిలబడి తినడం , పరిగెత్తుతూ తినడం వంటివి చేయకూడదు.
7. భోజనం చేసేటప్పుడు నేల మీద కూర్చుని భోజనం చేయడం ఉత్తమం. అందులోనూ అరిటాకులో  భోజనం తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు.
8. భోజనం చేసేటప్పుడు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. అలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతాయి.
9. భోజనం చేసేటప్పుడు దేవుడిని స్మరించుకుని భోజనం చేయాలి.

అందుచేతనే మన పూర్వీకులు అన్నాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: