మంచిమాట :పెద్దల మాట నిర్లక్ష్యం చేస్తే.. జరిగేది ఇదే..

Divya
అనగనగా రాజు పాలెం అనే ఓ గ్రామం ఉండేది. ఆ గ్రామం లోతట్టు ప్రదేశంలో ఉంటుంది. గోదావరి సమీపంలో ఉండడం కారణం చేత పెద్ద పెద్ద వర్షాలకు తట్టుకోలేక, ఆ గ్రామం మునిగిపోతూ ఉంటుంది. ఒకసారి అనుకోకుండా ఆ ఊరికి వరదలు వచ్చాయి. ఇక ప్రజలంతా ప్రాణభీతితో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తసాగారు. అంతలో వారికి ఒక ముని ఎదురయ్యారు. ఆయన గ్రామస్తులతో.." మీరు వెళ్ళేటప్పుడు ఆ మూలంగా కనిపిస్తున్న గులకరాళ్ళలో.. మీకు ఎన్ని చేతనైతే అన్ని తీసుకెళ్లండి. అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి" అని సలహా ఇచ్చాడు.
ఈ మాటలు విన్న కొంతమంది .." మా బాధలలో మేము అంటే ఈ గులకరాళ్ళు గోల ఏంటి స్వామి..!" అంటూ కొంతమంది విరుచుకుపడుతూ, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయారు. మరి కొంతమంది స్వామి ఎందుకు చెబుతున్నారో..? ఏమో..? తీసుకెళ్తే పోలా..అంటూ మరికొంతమంది వారికి ఎన్ని చేతనైతే అన్ని గులకరాళ్ళను తీసుకెళ్లడం మొదలు పెట్టారు.. ఇక మరి కొంతమందేమో స్వామీజీ ఎప్పుడు మనమేలే కోరతారు కదా..!  ఆయన చెప్పినట్లు చేద్దామని.. ఎవరి శక్తికొలది వాళ్లు గులకరాళ్లు చేతపట్టుకొని పరుగులు తీయడం మొదలుపెట్టారు.

ఇక వరద తాకిడి నుంచి తప్పించుకున్న గ్రామస్తులందరూ, ఎత్తైన ప్రదేశంలో గుడారాలు నిర్మించుకుని, నివసించడం మొదలుపెట్టారు. కొంత కాలానికి ఒక ఇంట్లో ఉన్న గులకరాళ్ళతో, ఆ ఇంట్లో పిల్లలు ఆడుతుండగా ,అందులో ఒక రాయి మెరిసింది. దానిని ఆ ఇంటి యజమాని గమనించాడు. ఇక ఆ రాయిని సాన పెట్టి  చూడగా, అది వజ్రం అని తేలింది. ఇక ఆయన ఆశ్చర్యానికి గురి అయ్యాడు. కొంత నిమిషం కాల వ్యవధిలోనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది. ఇక ఊరి ప్రజలంతా తాము తెచ్చుకున్న తెచ్చుకున్న గులకరాళ్ళను సాన పెట్టించారు. అవి వజ్రాలుగా మారడం  చూసి నమ్మలేక పోయారు.
అయితే స్వామీజీ మాటలు విని ఎక్కువ గులకరాళ్ళను తెచ్చుకున్న వాళ్ళు.. కోటీశ్వరులు కాగా, కొన్ని గులకరాళ్ళను తెచ్చుకున్న వారు ఆ మేరకు లక్షాధికారులు అయ్యారు. ఇక ఏమి తెచ్చుకోని వాళ్ళు.. నిరుత్సాహంతో పశ్చాత్తాప పడ్డారు. ఇదే కాదు ఏదైనా సరే ..పెద్దలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిదీ ఆలోచిస్తారు.. అలాంటి సమయంలో పిల్లలు పెద్దల మాటలను విని తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: