మంచిమాట : శనివారం కొనుగోలు చేయని వస్తువులు ఏంటో తెలుసా..?

Divya

సాధారణంగా ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఫలానా రోజు వస్తువులు కొనకూడదు అనేది శాస్త్రంలో నిర్ణయించబడింది. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజులలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదు అని పెద్దవాళ్లు చెబుతుండేవారు. శనివారం నాడు ముఖ్యంగా ఏ ఏ వస్తువులు కొనుగోలు చేయకూడదు, ఒకవేళ కొనుగోలు చేస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం రోజు ఇనుప లోహంతో తయారైన వస్తువులను కొనుగోలు చేయరాదు. ఇలా కొనుగోలు చేయడం వల్ల వ్యాపారంలో నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇనుప లోహాలతో పాటు నూనెను కూడా కొనుగోలు చేయకూడదు.
కానీ నూనె ను శనివారం రోజు దానంగా ఇవ్వవచ్చు. ఇక శనివారం రోజు పోపు దినుసులలో ఉపయోగించే ఆవాలను కూడా కొనుగోలు చేయరాదు. ఇక ఉప్పు విషయానికి వస్తే, ఉప్పు ఆహారంలో ప్రధానమైనది. కానీ ఉప్పును కూడా శనివారం రోజు కొనుగోలు చేయరాదు. ఒకవేళ కొనుగోలు చేస్తే కచ్చితంగా అప్పుల బాధలను మీద తెచ్చుకున్నట్లు అవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనివారం ఉప్పు కొనుగోలు చేస్తే , అది వ్యాధి కారకం అవుతుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కత్తెరలను కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ అలా కొనుగోలు చేసినట్లయితే ఒత్తిడి భారం మరింత పెరుగుతుంది. అలాగే నలుపు దుస్తులు, నలుపు బూట్లను కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదు. ఇలా నల్లటి వస్త్రాలను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో అశుభం కలిగే అవకాశం ఉందట. అంతేకాదు శనివారం రోజు ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయకూడదు. ఇలా ఇంధనాన్ని కొనుగోలు చేసి, ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత ఇంటి బాధలు ఎక్కువ అవుతాయి.
శనివారం పూట చీపురు ను కూడా కొనుగోలు చేయకూడదు. ఇక అంతే కాదు గింజలను శనివారం రోజు పిండి కొట్టి ఉంచకూడదు. ఇలా పిండి చేయడం వల్ల ఆహార సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: