మంచిమాట: మహాభారతంలో పంచపాండవుల జననం ఎట్టిది..

Divya

న్యాయానికి, ధర్మానికి ,సహనానికి, ధైర్యానికి , సాహసానికి పెట్టింది పేరు ఈ ఐదుగురు పంచ పాండవులు. మహాభారతంలో పాండవులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ పంచ పాండవులలో ధర్మరాజు, భీష్ముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీరందరూ పంచపాండవులు అని తెలుసు. కానీ వీరందరూ ఒకే తల్లికి పుట్టారా ?లేక వేర్వేరు తల్లులకు పుట్టారా.. ?ఒకవేళ వేరువేరు తల్లులకు పుడితే పంచపాండవులు ఎలా అయ్యారు..?వీరి జననం ఎట్టిది..? వీరు మహాభారతంలో ఎక్కడ జన్మించారు..? ఎవరికి జన్మించారు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పాండురాజు కు ఇద్దరు భార్యలు. ఒకరు కుంతీదేవి, మరొకరు మాధురుఖి.. ఒకరోజు, ఒక సమయంలో ఒక ముని ఇంకా ఆయన భార్య ఇద్దరు సంభోగంలో ఉండగా, పాండురాజు జింక అని భ్రమించి, వారిపై బాణం సంధించాడు. ఆ బాణానికి ముని ఇంకా అతని భార్య మరణిస్తారు. ఇక మరణించే ముందు ముని మహారాజుతో నీవు ఒక రాజువి అయ్యుండి.. ఎలాంటి తప్పు చేయకుండా ఒక నిర్దోషిని శిక్షించావు. నీవు నీ భార్యతో కానీ మరే ఇతర ఆడవారితో కానీ కలిసి సంభోగం చేస్తే మరణిస్తావు అని శపిస్తాడు.

ఇక కుంతీదేవి విషయానికొస్తే ,ఆమె చిన్నతనం నుండి దుర్వాస మహర్షికి సేవలు చేస్తూ ఉండేది. ఇక కుంతీ దేవి సేవలకు మెచ్చిన దుర్వాస మహర్షి , కుంతీదేవికి ఒక వరాన్ని ఇస్తాడు. అదేమిటంటే.." నేను నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను.. నీవు భక్తిశ్రద్దలతో నీకు నచ్చిన దేవుళ్లను స్మరిస్తూ.. ఈ మంత్రం జపించడం వల్ల వారు నీవు కోరుకున్న కోరికను వారు తప్పకుండా నెరవేరుస్తారు" అని వరం ప్రసాదిస్తాడు దుర్వాసమహర్షి. ఇక కుంతీదేవి , పాండురాజు ని వివాహం చేసుకున్న తరువాత పాండురాజు తనకు సంతానమే కలిగే భాగ్యమే లేదనుకుంటూ చింతిస్తూ ఉండగా.. కుంతీదేవి తనకున్న వరం గురించి పాండురాజుకు వివరిస్తుంది.

ఆ తర్వాత కుంతీదేవి పాండు రాజును.." పాండు రాజా..! ఆ మంత్రం సహాయంతో నేను ఏ దేవుడిని ఆరాధించాలో చెప్పండి.. అని అడగగా.. అందుకు పాండురాజు .." ధర్మ దేవుని మించిన దైవం లేదు.. ఆయనను స్మరించు" అని చెప్పాడు. అప్పుడు కుంతీదేవి శుచి అయి, ధర్మ దేవున్ని, ఆ మంత్రం ద్వారా స్మరిస్తుంది. ఇక ధర్మ దేవుని దయ వలన ఆమె గర్భం దాల్చింది. ఇక దాదాపు సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఇక ఆ కుమారుడికి యుధిష్ఠిర అని నామకరణం చేసింది. ఇక ఈ బాలుడిని చూసిన మునులు ఇతడు కౌరవ సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. ఇతడే ధర్మరాజు. ఆతరువాత కుంతిదేవి వాయు దేవుని దయవలన భీష్ముడికి జన్మనిస్తుంది.

తర్వాత కుంతీదేవి దేవేంద్రుడి దయవలన అర్జునుడికి జన్మనిచ్చింది. ఇక ధర్మ రాజు, బలశాలి భీస్మ, సాహస శాలి అయిన అర్జునుడి వంటి పుత్రులకు జన్మనిచ్చి హాయిగా కాలం గడుపుతున్న సమయంలో, ఇక పాండురాజు రెండవ భార్య సంతానం లేక దుఃఖించసాగింది. ఇక పాండురాజు తన రెండవ భార్య దుఃఖాన్ని తట్టుకోలేక,  కుంతీదేవిని పిలిపించి, మాధురిఖి కూడా సంతానం కలిగేలా చెయ్యమని కోరుతాడు. ఇక కుంతీదేవి సకల లోక కల్యాణానికి కారకులైన అశ్విని దేవతలను ప్రార్థించింది. ఇక వారి వలన మాధురికి ఇద్దరు పుత్రులు జన్మించారు. వారే  నకులుడు, సహదేవుడు.ఇలా ఈ విధంగా పంచపాండవుల జననం మహాభారతంలో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: