మంచి మాట : గొప్పవాళ్ళు చెప్పిన మంచి పలుకులు ఏమిటో తెలుసుకుందామా..!
ప్రస్తుతం మన సమాజంలో మంచి , చెడు అనేవి రెండు తారతమ్యాలు లాగా ఉన్నాయి. వీటిని తెలుసుకోగలిగితే జీవితంలో ఎలాంటి అనర్ధాలు జరగకుండా ఉండవచ్చు. అయితే మన మేధావులు అనుభవించిన కొన్ని జీవిత సత్యాలను మనకు వారి నోటి మాటలలో చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
1. వివేకానంద:
నిశ్శబ్దంగా ఉండు... ఎందుకంటే నాణెము శబ్దం చేసినంతగా నోట్ చేయలేదు. విలువ కలిగినవి అలానే ఉంటాయి. అందుకే అంటారు అన్నీ ఉన్న విస్తరి అనిగి మనిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరి ఎగిరి పడుతుంది అని.
2. షేక్ స్పియర్:
ఇతరుల భావాలతో ఆటలాడు కోకూడదు.. అలా చేస్తే నువ్వు గెలవచ్చు కానీ, ఒక మంచి వ్యక్తిని జీవితాంతం కోల్పోగలవు..
3. నెపోలియన్:
ఈ ప్రపంచం ఎదుర్కొనే చాలా ఇబ్బందులకు కారణం..
ప్రశాంతి ని కలిగించే చెడ్డ వ్యక్తులు కాదు.. మంచి వ్యక్తులు మౌనం పాటించడం..
4. ఐన్ స్టీన్:
ఎవరైతే నన్ను నిరాకరించారో వారిపట్ల నేను కృతజ్ఞుడినై ఉన్నాను. ఎందుకంటే వారి వల్లనే నా అంతట నేను గా ఎదిగాను కాబట్టి..
5. అబ్రహం లింకన్:
నీలో స్నేహ గుణం అనేది నీ బలహీనత అయినట్లయితే, ప్రపంచంలో అందరికన్నా నువ్వు బలమైన వాడివని అర్థం..
6. చార్లీ చాప్లిన్:
నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితంలో భాదలు ఉండవని అనుకోవద్దు. వాటిని ఎదుర్కొని నిలబడే తత్వం ఉండడంవల్ల వారు మనకు ఆ విధంగా కనిపిస్తారు..
7. విలియం ఆర్థర్:
అవకాశాలు సూర్యకిరణాల వంటివి.. అందుకే వాటిని వీలైనంత త్వరగా దొరకబుచ్చుకోవాలి.. ఆలస్యం చేస్తే వాటిని వదులుకోక తప్పదు..
8. హిట్లర్:
నువ్వు వెలుగు లో ఉన్నంతకాలం అందరూ నిన్ను అనుసరిస్తారు.. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీ వెంట రాదు..
చూశారు కదా ఈ విషయాలు అన్నీ మన జీవితంలో అందరికీ వర్తిస్తాయి అని చెప్పవచ్చు.మీరు కూడా ఈ జీవిత సత్యాలను చదివారు కదా చెడు మార్గంలో నడిచేవారు,మంచి మార్గంలో నడవండి.