మంచి మాట : చెప్పుడు మాటలు నమ్మకూడదు..మాట్లాడకూడదు.. వినకూడదు..

Divya

చెప్పుడు మాటల వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.. వీటివల్ల ఎంతో గొప్ప వాళ్లే సర్వనాశనం అయ్యారు.. అందుకే పూర్వకాలంలో కూడా మనకు తెలిసిన మహానుభావులు కూడా కేవలం మీ చెప్పుడు మాటలు విని సర్వం కోల్పోయారు. అలా జరిగిన  అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వియ్యంకుడు చెప్పుడు మాటలు విని, మహామంత్రి తిమ్మరుసు కళ్లు పీకించాడు శ్రీకృష్ణదేవరాయలు..
తన సొంత ఖర్చులతో  టోపీలు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని, అధికారం కోసం కన్న తల్లిదండ్రులను బంధించాడు.
తల్లిగర్భంలో చనిపోయే బిందుసారుడిని తన ఉపాయంతో బతికిస్తే, చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడు చాణుక్యుడి  మరణానికి కారణం అయ్యాడు..
చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యం పై పగ పెంచుకున్నాడు శని.  అదే శకుని చెప్పుడు మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులతో యుద్ధంచేసి, సర్వం కోల్పోయాడు. ఇతనితో పాటు కౌరవ వంశం మొత్తం నాశనం అయిపోయింది.
చెప్పుడు మాటలు విని రావణబ్రహ్మ అంతటి మహాజ్ఞానే సీతమ్మ తల్లిని అపహరించి, రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు. చివరకు మరణించాడు
చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు.
ఇక ఈ చెప్పుడు మాటలు విని సంసారాలను నాశనం చేసుకున్న వారు మరి కొందరు.
చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు..
శకుని చెప్పుడు మాటలు వినడం వల్ల హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయ్యింది. ఇక మనం ఎంత.
మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే  ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా లేకపోతే, ఎంతటివారికైనా అపజయం కలుగుతుంది..
కాబట్టి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.. ఎందుకంటే ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడు.. నీ గురించి వేరే వాళ్ల దగ్గర చెప్పడన్న నమ్మకం ఏమి..
అందుకే ఎదుటి వాళ్ళతో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు.. ఇంత పెద్ద పెద్ద వాళ్లే సర్వం కోల్పోయినప్పుడు సామాన్యులం మనమెంత.. అందుకే అన్నారు చెప్పుడు మాటలు వినే వాడు ఎప్పటికీ జీవితంలో పైకి రాడు అని.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: