మంచిమాట : భగవంతుడు అన్ని చోట్లా వ్యాపించి ఉంటే, మనం ప్రత్యేకంగా గుడికి ఎందుకు వెళ్లాలి..?

Divya

భగవంతుడు అన్ని చోట్లా వ్యాపించి ఉంటే,  మనం ప్రత్యేకంగా గుడికి ఎందుకు వెళ్లాలి..? ప్రతి చోట దేవుడు ఉన్నాడు అని అంటారు కదా.. మరి ప్రత్యేకంగా దేవుడి దర్శనం కావాలి అంటే దేవాలయాలకు మాత్రమే ఎందుకు వెళ్లాలి ..? మనం పూజించే మన ఇంటి పూజ గదిలో కూడా దేవుడు ఉన్నాడు కదా.. మన ఇంట్లో ఉండే దేవుడిని కోరికలు కోరితే నెరవేర్చడా.. అనే ఇలాంటి సందేహాలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం..

దేవుడిని సర్వాంతర్యామి అని అంటారు. అంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని అర్థం. అంతేకాకుండా  దేవుడు అనువనువున మనలను గమనిస్తూనే ఉంటాడు. అయితే దేవుడు ప్రతి చోట ఉన్నప్పటికీ, ఆ దేవుడిని మనం గమనించగలిగే శక్తి మనకు కావాలి. కానీ దేవుడి ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అని అడిగే వాళ్లు కూడా ఉంటారు.. అలాంటి వారి కోసమే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసి,  అందులో భగవంతుడిని ప్రతిష్టించడం జరిగింది. దానినే మనం దేవాలయాలుగా పరిగణిస్తాము.. అంటే ఉదాహరణకు పాల నుండి వెన్న వస్తుంది అని అంటారు. అయితే అది వెంటనే చూపించమంటే ఎలా కుదురుతుంది . పాలను కాచాలి, తోడు పెట్టాలి. తోడిన పెరుగును  మజ్జిగగా చిలికిన తర్వాత మాత్రమే వెన్న వస్తుంది. ఇంత ప్రాసెస్ జరిగిన తరువాత నే వెన్నని చూపించగలము . ఇక భగవంతుడు కూడా అంతే..

భగవంతుడు ఎదుట కనిపించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది. మన మనసును భగవంతుడిపై ఏకీకృతం చేయాలి. అందుకే దేవాలయాలను ఏర్పాటు చేసి, అక్కడున్న వాతావరణం కూడా దేవాలయాలకు వచ్చే భక్తులను ఆనందోత్సాహాల కు గురి చేస్తూ ఉంటుంది.  ఇక ఎప్పుడైతే దేవాలయాలకు భక్తులు వెళ్తారో, అప్పుడు వారి మనసు మొత్తం దేవుడిపైనే నిమగ్నం అవుతుంది. ఎంత ఒత్తిడి ఉన్న వాళ్లు కూడా దేవాలయాలకు వెళ్లగానే   వారి మనసులో  ప్రశాంతతను నింపు కుంటారు. అందుకోసమే దేవాలయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

అయితే ఈ దేవాలయాలను ఏర్పాటు చేసేటప్పుడు చుట్టూ ఉన్న వాతావరణాన్ని, భూమి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతనే ఆ ప్రదేశంలో విగ్రహాన్ని ప్రతిష్టించడం జరుగుతుంది. మరి కొన్ని ప్రదేశాలలో భగవంతుడు తనంతటతానే  స్వయంగా కొలువు తీరుతాడు. అలాంటి ప్రదేశాలను స్వయంభూ దేవాలయాలు అని అంటారు.. అయితే దేవాలయాలకు ఎందుకు వెళ్తారు అంటే అక్కడున్న వాతావరణానికి మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడిపై మనసును నిమగ్నం చేయగలిగే శక్తి మనకు లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది.  ఆరోగ్యం పెంపొందుతుంది. ఎప్పుడైతే ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయాన్ని గడుపుతామో అప్పుడు మనం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: