మంచిమాట : డబ్బుతో వచ్చినవాడికి, కష్టపడి పైకొచ్చిన వాడికి మధ్య తేడా ఏంటో తెలుసా..?

Divya

ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..డబ్బుతో వచ్చినవాడికి, కష్టపడి పైకొచ్చిన వాడికి మధ్య తేడా ఏంటో తెలుసా.?

 దీని వివరణ ఏమిటంటే .. కష్టపడకుండా కేవలం డబ్బు తో పైకి వచ్చిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళకు మాత్రమే విలువ ఇస్తారు . కానీ కష్టపడి పైకి వచ్చిన వాడు కష్టపడే ప్రతి మనిషికి విలువ ఇస్తాడు. డబ్బున్న వాళ్లకు, శ్రమించిన  వాళ్లకు మధ్య తేడా తెలిస్తే ఈ ప్రపంచంలో ధనికుడు, పేదవాడు అనే తేడా ఉండదు. డబ్బు ఎప్పుడూ మనతోనే ఉండదు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో..కూడా తెలియని పరిస్థితులలో డబ్బును మాత్రమే నమ్ముకొని జీవించడం సరికాదు. కష్టపడి డబ్బు సంపాదించినప్పుడు మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది. అప్పుడే రూపాయి విలువ కూడా తెలుస్తుంది.

కాబట్టి తండ్రి, తాతల ఆస్తితో పైకెదిగిన వాడికి ఎప్పటికీ డబ్బు విలువ తెలియదు. పైగా డబ్బులు వృధా చేస్తాడు. రూపాయి విలువ తెలియని వాడి దగ్గర శ్రామికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాడు ఎప్పటికీ వాటి స్వభావాన్ని మార్చుకోలేదు. కేవలం ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వారికి మాత్రమే గౌరవం ఇవ్వడం నేర్చుకుంటాడు. కానీ శ్రమించిన వాడు అలా కాదు. కష్టపడి ఎవరైతే పైకి వస్తారో, వారికి కష్టం విలువ తెలుసు కాబట్టి శ్రమించే ప్రతి మనిషికి విలువ ఇస్తూనే డబ్బు ఉన్న వారికి కూడా విలువ ఇస్తాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: