మంచిమాట: అబద్ధం అప్పటికే ముప్పు..!

Divya

మనం నివసిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము.. అయితే ఇవన్నీ మనకు తెలియాలి అంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..అబద్ధం అప్పటికే ముప్పు..

దీని వివరణ ఏమిటంటే.. అసత్యం చెప్పడం వల్ల ఎప్పటికీ  జీవితంలో ఎవరు నమ్మరు ..  దేనిని సాధించలేరు. అబద్దం చెప్పడం వల్ల ఎప్పటికైనా అనర్థం జరుగుతుంది .అని దీని అర్థం . అందులో భాగంగానే నేను మీకు ఎప్పటిలాగానే ఒక కథను చెబుతాను ..ఒక కట్టెలు కొట్టుకునేవాడు చెరువు ఒడ్డున చెట్టు ఎక్కి, కొమ్మలు నరుకుతున్నాడు. ఆ సమయంలో అతని గొడ్డలి చేయి జారిపోయి చెరువులో పడి పోయింది. ఆ గొడ్డలి కాస్త చెరువులో పడిపోవడంతో, కట్టెలు కొట్టే వ్యక్తి చెట్టు నుండి కిందకు దిగి, అయ్యో నా గొడ్డలి చెరువులో పడిపోయింది అంటూ ఏడవసాగాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై.. ఎందుకు నాయనా..!  ఏడుస్తున్నావు.. నీ ఏడుపుకు కారణం ఏమిటో..నాతో చెప్పగలవా..?  అని అడిగింది.  అప్పుడు కట్టెలు కొట్టే వ్యక్తి నేను చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతుండగా, నా గొడ్డలి జారీ ఆ చెరువు లోకి పడి పోయింది అని సమాధానం ఇచ్చాడు..

అప్పుడు గంగాదేవి చెరువు లోపలికి వెళ్లి ఒక బంగారు గొడ్డలి తీసుకువచ్చి, అతనికి చూపించి,ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది. అప్పుడతను ఈ గొడ్డలి నాది కాదు అని సమాధానం చెప్పాడు. మరోసారి గంగాదేవి చెరువు లోపలికి వెళ్లి  వెండి గొడ్డలిని తీసుకొచ్చి,ఇది నీదే నేమో చూడు అని అడిగింది. ఇది కూడా నాది కాదు  అని  చెప్పాడు.  ఇక మూడవ సారి గంగాదేవి అతని గొడ్డల్ని అతనికి తీసుకొచ్చి చూపించింది. అవును ఇదేనమ్మా..నా గొడ్డలి. కట్టెలు నరుకుతుండగా చెరువులోకి జారి పడిపోయింది. నాకు నా గొడ్డలి తిరిగి తీసుకువచ్చినందుకు మీకు ధన్యవాదాలు తల్లీ..అని చెప్పి చేతిలోకి తీసుకున్నాడు..

అప్పుడు గంగాదేవి కట్టెలు కొట్టే అతని నిజాయితీని మెచ్చుకుని, ఆ మూడు గొడ్డళ్ళను కూడా తనకు బహుమానంగా ఇచ్చింది. తద్వారా అతను ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.. ఆ మూడు గొడ్డళ్ళు తీసుకున్న అతని  ఉన్నత స్థాయిని చూసి పక్కింటి అతను ఓర్వలేక,  నువ్వు ఇంత స్థాయికి ఎలా ఎదిగావని అడిగాడు. అప్పుడు జరిగిన ఉదంతాన్ని మొత్తం అతనికి వివరించాడు కట్టెలు కొట్టే అతను. పక్కింటి అతను కూడా దురాశతో  నేను కూడా అదే పని చేస్తే, నాకు కూడా ఇలాంటి గొడవలే వస్తాయి కదా అనే అప్పుడు నేను కూడా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు కదా అని ఆశపడ్డాడు.

అనుకున్నదే తడవుగా ఒక గొడ్డలి తీసుకెళ్లి, చెరువులోకి పడవేసి, అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై..ఎప్పటిలానే అతనిని కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది.  అప్పుడతను నా గొడ్డలి నీటిలో పడిపోయింది అమ్మ అని చెప్పాడు.  గంగాదేవి ఎప్పటిలాగానే బంగారు గొడ్డలి తీసుకొచ్చి, అతనికి చూపించి ఇది నీదేనా అని అడిగింది. ఇక బంగారు గొడ్డలి చూడగానే మనసు ఆగ లేక అతను అవునమ్మా..ఇది నాదే.  చెరువులోకి పడిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గొడ్డలితో సహా గంగాదేవి తిరిగి చెరువు లోకి వెళ్ళిపోయింది. ఇక ఒక్క అసత్యం చెప్పడం వల్ల అతని గొడ్డలి కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి అబద్ధం చెప్పడం ఎప్పటికీ ముప్పే అని ఈ సామెత యొక్క వివరణ..

కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరూ అబద్దం చెప్పడానికి ప్రయత్నించకూడదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: