మంచిమాట : మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు.. అలాగే కోపంతో రగిలిపోయే వారికి సంతోషాలు ఎన్నడూ వుండవు..

Divya

ప్రతి సారి ప్రతి క్షణం సరికొత్తగా వినూత్నమైన ఆలోచన తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ, మీలో మార్పులు తీసుకురావాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇండియా హెరాల్డ్.. ప్రస్తుతం అందులో భాగంగానే మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది. అదేమిటంటే..మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు.. అలాగే కోపంతో రగిలిపోయే వారికి సంతోషాలు ఎన్నడూ వుండవు..

దీని అర్థం ఏమిటంటే..భగభగమండే చెట్టుపై వాలడానికి ఏ పక్షి ముందుకు రాదు. ఒకవేళ వచ్చినా ఆ మంటలకు మాడి మసై పోవడం ఖాయం. అలా ఎప్పుడూ కోపంతో రగిలి పోయే వారికి సంతోషాలు అంటూ ఏవి ఉండవు. ఎందుకంటే ఎవరైతే ఎప్పుడూ కోపంగా ఉంటారో, వారి దగ్గరికి ఎవరూ రారు. పైగా మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువ. కోపంతో రగిలి పోయే వారితో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపించరు. మండే చెట్టు ఎంత ప్రమాదకరమో కోపంతో రగిలి పోయే వ్యక్తి కూడా అంతే ప్రమాదకరం అని దీని అర్థం..

ఉదాహరణకు  ఎప్పుడూ చెట్లపై వాళుతూ కిలకిల రాగాలతో  ఎన్నో సందడులు చేసే పక్షులు , చెట్టు పచ్చగా పదికాలాలపాటు పదిలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి పక్షి ఆ చెట్టు పై వాలడానికి మక్కువ చూపుతుంది . ఒకవేళ   ఆ చెట్టే కాలిపోతోంది అనుకోండి.. ఇక ఆ చెట్టుపై వాలడానికి ఏ పక్షి కూడా రాదు. ఎందుకంటే మండే మంటల్లో పక్షి కాలిపోవడం ఖాయం. తన జీవితమే లేకుండా పోతుంది.

 ఇక మనిషి కూడా అంతే. మనిషి ఎప్పుడూ నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ అడిగిన సాయం చేస్తూ ఉండడం వల్ల ఆ మనిషి దగ్గరకు ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైతే మనిషి కోపంతో రగిలిపోతాడో తను విచక్షణ రహితంగా ప్రవర్తిస్తాడు. బుద్ధిని కూడా కోల్పోతాడు. తన జీవితంలో సంతోషం అంటూ ఏది ఉండదు. ఫలితంగా మిత్రులు కూడా శత్రువులు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుని, నలుగురితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: