మంచి మాట : ఆపదలో ఉన్నప్పుడు సాయం చేస్తే.. వారు దేవుని కన్నా గొప్పవాళ్లు...

Divya

ప్రతి రోజులాగే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది.  అది ఏమిటంటే..ఆపదలో ఉన్నప్పుడు సాయం చేస్తే.. వారు దేవుని కన్నా గొప్పవాళ్లు... దీని అర్థం ఏమిటంటే అవసరం లేని సాయం వ్యర్థం.. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నీకు వీలైనంత సాయం వారికి చేస్తే, సాయం పొందిన వారికి నీవు దేవుడి కన్నా గొప్ప వాడిలాగా కనిపిస్తావు. అని దీనికి వివరణ..

ఉదాహరణకు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నీకు సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ముందుకెళ్లాలి. ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి మనం చేసే చిన్న సహాయం అయినా సరే, అది ఒక గొప్ప లాగా అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు అవసరం ఉన్న వ్యక్తికి సహాయం చేయలేక పోతే, ఆ మనిషికి అర్థమే లేదు.. ఉదాహరణకు ప్రస్తుత కాలంలో రోడ్డు పైన ఎన్నో ఆక్సిడెంట్లను చూస్తూనే ఉన్నాం.. కానీ మనలో చాలామంది చూసి చూడక వదిలేసి వెళ్తుంటారు..

అలా ఆక్సిడెంట్ అయి, రోడ్డు మీద కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు మీరే స్వయంగా కల్పించుకుని సహాయం చేస్తే,జన్మలో వారు మిమ్మల్ని మర్చిపోరు. ఆ విషయంలో మీరు చేసిన సహాయం కేవలం ఒక్కరికి మాత్రమే వర్తించదు.. అతని మీద ఆధారపడిన ఎన్నో కుటుంబాలు, కుటుంబ సభ్యులు మీ పేరును జీవితాంతం తలచుకుంటూనే ఉంటారు. అంతే కాదు ఆకలి అని అడిగినప్పుడు లేదు అని అనుకోకుండా గుప్పెడు మెతుకులు పెట్టిన,అది వారికి మహాభాగ్యం గా అనిపిస్తుంది..

అలాంటి పరిస్థితులలో డబ్బు సహాయం కన్నా మనం పెట్టే ఆ గుప్పెడు మెతుకులు వాడి ప్రాణాలు నిలుపుతాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి.. కాబట్టి ఎవరైనా సహాయం అడిగినప్పుడు నాకెందుకులే అని అనుకోకుండా మీకు సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మనుషులు దేవుడు ప్రతిరూపాలు అనడానికి ఇదే నిదర్శనం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: