మంచి మాట : అబద్దానికి అభిమానులు ఎక్కువ .. నిజానికి శత్రువులు ఎక్కువ..!

Divya

 మన పెద్దలు ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం చెబుతూనే ఉంటారు.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక అపార్థాలకు లోనే ఉంటారు.  అలాంటి ఒక సందర్భం గురించి చెప్పే ఒక మంచి మాట అబద్దానికి అభిమానులు ఎక్కువ..నిజానికి శత్రువులు ఎక్కువ.. దీని అర్థం ఏమిటంటే అబద్ధం చాలా తీయగా ఉంటుంది కాబట్టి అభిమానులు ఎక్కువ మంది ఉంటారు.. అలాగే నిజం ఎప్పటికీ చేదుగానే ఉంటుంది. దీనిని స్వీకరించ లేనివారు శత్రువులుగా మారుతూ ఉంటారు.. కానీ కాలాన్ని బట్టి నిజం చెప్పడానికి ప్రయత్నించాలి..

 ఉదాహరణకు  మీ ఫ్రెండు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి . ఆ తప్పు గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు  ఒకవేళ మీరు అబద్ధం చెప్పారు అనుకోండి .. అబద్ధం తీయగా ఉంటుంది కాబట్టి  మీ ఫ్రెండ్ మీతో  చిరకాలం పాటు ఉంటాడు.. ఒకవేళ మీరు గనక నిజం చెప్తే.. నిజం నిష్టూరంగా ఉంటుంది కాబట్టి  ఇక మీ ఫ్రెండ్ ఎప్పటికీ మీతో ఉండదు.. కానీ నిజం తెలుసుకున్న నాటికి సత్యమే గెలుస్తుంది.. అసత్యం తాత్కాలికంగా బాగున్నప్పటికీ, పోను పోను అపార్థాలకు దారి తీస్తుంది..


నిజం నిష్టూరంగా ఉన్నప్పటికీ సాధ్యమైనంతవరకూ సత్యాన్ని పలకడానికి అలవాటు చేసుకోవాలి..  నిజం అనేది మొదట్లో చేదుగా ఉన్నప్పటికీ, పోను పోను అలవాటుపడితే నిజం విలువ ఏంటో తెలుస్తుంది.. కాబట్టి సాధ్యమైనంత వరకూ నిజమే మాట్లాడాలి..
 అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ఏదైనా ఒక వార్త గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఎంత బాధాకరమైన విషయం అయినప్పటికీ అందులో దాగి ఉన్న నిగూఢ అర్థాన్ని వెతికి, దాని వివరణ ఏంటో చెప్పే ప్రయత్నం చేయాలి..


చూశారు కదా ఫ్రెండ్స్.. నిజం ఎప్పటికైనా చేదుగానే ఉంటుంది.. దానిని అర్థం చేసుకోలేని ఎంతో మంది శత్రువులు గా మారుతూ ఉంటారు.. దాన్ని మీరు పట్టించుకోకుండా ఎప్పటిలానే సత్యం పలుకుతూ  న్యాయం వైపు వెళ్లడానికి ప్రయత్నించండి. అప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉంటుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: