మంచిమాట: నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలవదు!

Durga Writes

నేటి మంచిమాట.. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలవదు! అవును.. మన జీవితంలో తల్లిదండ్రుల తరువాత స్నేహితులకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. బాల్యం నుంచి మొదలైన స్నేహాలలో కొన్ని చివరి వరకు నిలిస్తే కొన్ని స్నేహాలు మాత్రం మధ్యలోనే దూరమవుతాయి. మనం నమ్మిన స్నేహితులు నమ్మకంగా నిజాయితీతో ఉంటే ఆ స్నేహం కలకాలం నిలుస్తుంది. అలా కాకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే మాత్రం బంధాలు విడిపోతాయి.

 

 

మనం ఒకరితో స్నేహం చేస్తాం. వారిని బాగా నమ్ముతాం.. నిజాయితీగా ఉంటాం. కానీ అటువైపు వారు నిజాయితీగా ఉండరు. మనం ఎంతో నమ్మి వారికీ మంచి చేసిన చివరికి అది చెడు అవుతుంది. మనం అందరిని నమ్ముతాం అది మన సహజ గుణం. కానీ అందరూ మనం నమ్మినట్టే ఉంటారు అని అనుకోవడం మన మూర్ఖత్వం. ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు అని చెప్పేదే ఈ కాలం స్నేహబంధం. 

 

 

మన స్నేహం లో నిజాయితీ, నమ్మకం ఉండాలి. అవతలి వ్యక్తుల నుంచి అవే ఆశించాలి. మన స్నేహితులు అలా లేరంటే ఎంత గొప్ప స్నేహం అయినా నిలవదు. నమ్మకం ఉండాలి అంటే మొదట మనం నిజాయితీగా ఉండాలి. అప్పుడే మంచి స్నేహం ఎల్లకాలం ఉంటుంది. లేదంటే ఎలాంటి స్నేహం అయినా చెడక తప్పదు. ఇతరుల నమ్మకాన్ని మనం చూరగొంటే గొప్ప స్నేహితులు, కష్టకాలంలో సహాయం చేసే స్నేహితులు మన జీవితంలో ఉంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: