మంచిమాట: నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అది అబద్ధం లాగే కనిపిస్తుంది!
నేటి మంచిమాట.. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పిన అది అబద్దంలాగే కనిపిస్తుంది! అవును.. నమ్మకం ఉంటే మనం ఏమైనా సాధించగలం. మనపైన నమ్మకం ఉంటేనే మనం ఏం చెప్పిన ఏం చేసిన అంత అబద్దంలా కనిపిస్తుంది. అందుకే మనల్ని నమ్మని వారికీ మనం దూరంగా ఉంటే మన జీవితం బాగుంటుంది.
భార్య భర్తల అయినా.. తల్లితండ్రుల అయినా అందరూ ఒకటే.. భార్య భర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే జీవితం ఆనందంగా సాగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా నమ్మకం లేకుంటే.. ఒకరిని ఒకరు నమ్ముకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది.
నమ్మకమే పునాది. మనకు ఏమి లేని వారు మనల్ని నమ్మి ముందడుగు వేస్తే మనకు ఎన్ని కష్టాలు వచ్చిన మనకు తోడుగా ఉంటారు. అదే మనల్ని నమ్మకపోతే మనతో ఎవరు ఉండరు. మనం నిజం చెప్పిన సరే అది అబద్దంలనే కనిపిస్తుంది. అందుకే మనల్ని నమ్మని వారు మన బంధువులు అయినా సరే దూరంగా ఉండడం మంచిది. అలా దూరంగా ఉంటేనే మన జీవితం బాగుంటుంది. మనకు ఏమి లేని సమయంలో మన శక్తిని చూసి మనతో వచ్చేవారే మనకు తోడుగా ఉంటారు. అలా మనల్ని నమ్మే వారు లేకపోతే కష్టం.
ఒకరు మనల్ని నమ్మిన నమ్మకపోయినా.. మనపైన మనం నమ్మకం పెట్టుకోవాలి. ఏమైనా సాధిస్తాం అనుకోవాలి. సమయం వచ్చినప్పుడు మనం సాధిస్తాం. నమ్మకమే పునాది. మనతో ఏమి లేనపుడు మనల్ని ఎవరు నమ్మరు. వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నించినా మన సమయమే వృధా. అందుకే మన జీవితాన్ని మనమే అందంగా సృష్టించుకుందాం.