మంచిమాట: చరిత్ర చదవడమే కాదు.. సృష్టించాలి!
నేటి మంచి మాట.. చరిత్ర చదవడమే కాదు సృష్టించాలి కూడా... అవును.. చిన్నప్పటి నుండి మనం చదివేది అంత చరిత్రే . ఎవరు సాధించలేనిది సాధించి.. వారి పేరును చరిత్రకి ఎక్కించారు.. అదే మనం ఇప్పుడు చదువుతున్నాం.. కానీ నిజానికి మనం ఆ చరిత్రలో మిగిలిపోవాలి అంటే ఎంత కష్టపడాలి మీరే ఆలోచించండి.
మనం చరిత్ర సృష్టించాలి అంటే ఎవరు చెయ్యలేనటువంటి పని మనం చెయ్యాలి.. చరిత్ర సృష్టించడం అంటే ఆషామాషీ కాదు.. అప్పట్లో సంవత్సరానికి ఆరు ఏడు సినిమాల్లో నటించాడు ఎన్టీఆర్.. ఆ తర్వాత కేవలం అంటే కేవలం 9 నెలల్లో పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీఆర్. అది చరిత్ర.. ఇంతవరుకు అలా ఎవరు కూడా కేవలం 9 నెలల్లో ముఖ్యమంత్రి అయినది లేదు.
ఇంకా ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ని 15 ఏళ్ళు పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. చేసింది ఎన్ని అరాచకాలు అయినా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించి చరిత్రకెక్కాడు కదా! ఇంకా సీఎం జగన్ కూడా అంతే.. ముఖ్యమంత్రి కావడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డారు.. ఎన్ని యాత్రలు చేశారు.. ఎన్ని హామీలు ఇచ్చారు.. అందుకే కనివిని ఎరగని రీతిలో ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ జగన్. ఇది ఒక గొప్ప చరిత్ర.
ఇంకా అలా నేడు మనం ఏం చేసిన రేపు అది చరిత్రలో మిగిలిపోవాలి.. నీకు నచ్చినది దక్కేలా చేసుకోవాల్సిన బాధ్యత నీది. నీకు నచ్చినది అయినా నలుగురికి ఉపయోగపడేలాంటిది కావాలి.. అప్పుడే చరిత్రలో మిగిలిపోతావు.. నువ్వు ఈరోజు చేసే పనే నిన్ను చరిత్రలో మిగులుస్తుంది..