మంచిమాట: మీరు దేనికి అర్హులో అదే మీకు దొరుకుతుంది!

Durga Writes

నేటి మంచిమాట... మీరు దేనికి అర్హులో అదే మీకు దొరుకుతుంది!  అవును.. మనం పుట్టింది మధ్య తరగతి ఇంట్లో అయినా కోరేది మాత్రం కోట్ల ఆస్తి.. పెద్ద ఇల్లు.. అన్ని ఆశిస్తారు.. దేవుడు దగ్గరకు వెళ్తే.. దేవుడా నాకు అది కావాలి.. ఇది కావాలి అని అడుగుతాం. కానీ మనం అడిగిన దాంట్లో దేవుడు మనకు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు.. 

 

అన్ని ఇస్తే దేవుడు ఎలా అవుతాడు.. అయన మన కష్టపడకుండా మనకు ఏమైనా ఇవ్వడానికి దేవుడికైనా శక్తి ఉండాలి కదా! మనం ఏదైనా దేవుడిని కోరము అంటే అందులో కాస్త న్యాయం ఉండాలి.. అప్పుడే మనకు కావాల్సింది మనకు దక్కుతుంది. లేదు అంటే ఎలా ? మనకు ఏమైనా కావాలి అంటే మనం కష్టపడాలి అప్పుడే ఫలితం ఉంటుంది. 

 

ఏది అంటే అది మనకు దక్కదు.. మనకు కావాల్సింది మనకు దక్కాలి అంటే మనం కష్టపడాలి... అప్పుడే మనకు దొరుకుతుంది. అంతేకాదు మనం కష్టపడినప్పటికీ మనం దానికి అర్హులం అయితేనే మనకు అది దక్కుతుంది. లేదు అంటే మనం ఎంతకష్టపడిన అది దక్కదు. అందుకే మనం ఒకటి కోరుకున్నప్పుడు మనం దాని కోసం కష్టపడాలి.. అప్పుడే విజయం సాధించగలం. 

 

మనకు కావాల్సినది మనకు దొరకాలి అంటే మనం ఏమైనా సాధించాలి.. ఎవరిని అడుక్కో కూడదు. అడుక్కునం అంటే మనకు ఏమి దక్కదు.. కాస్త కష్టమైన సరే చెయ్యాలి.. చేసి మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలి.. ఎవరిని ఆశించకూడదు.. ఆశించాల్సిన అవసరం మనకు లేదు..                                                             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: