మంచిమాట: విజయం సాధించాలి అంటే మొదట చేసే పనిని ప్రేమించాలి
నేటి మంచిమాట.. విజయం సాధించాలి అంటే మొదట చేసే పనిని ప్రేమించాలి. ఈ మాటను ఓ ప్రముఖుడు చెప్పాడు. అవును నిజం.. విజయం సాధించాలి అంటే మొదట చేసే పనిని ప్రేమించాలి.. లేదు అంటే ఆ పని మీద శ్రద్ద ఉండదు.. చెయ్యాలి అనే ఆలోచన ఉండదు. పనిని ప్రేమించాలి ఎందుకంటే నీకు కడుపు నిండుతుంది అంటే అది నీ పని వల్లనే.
అంతేకాదు మనం ఏదైనా విజయం సాధించాలి అంటే మొదట చేసే పనిని ప్రేమించాలి.. అప్పుడే ఆ పనిపై మనకు ప్రేమ పెరిగి చెయ్యాలి అనిపిస్తుంది. లేదు అంటే ఆ పని గురించి ఏం తెలుసుకోవాలి అన్న బద్దకంగానే ఉంటారు. ఆ పనిపై శ్రద్ద లేకపోవడం పక్కన పెడితే బద్ధకం పెరిగిపోతుంది.
ఏదైనా సాధించాలి అంటే దానిపై ప్రేమ ఉండాలి.. ఖచ్చితంగా సాధించాలి అని ఉండాలి. అలా కాదు అని చేసే పనిని ప్రేమించకుండా ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి అన్నట్టు ఉంటె ఎటువంటి విజయాన్ని సాధించలేరు. అందుకే ముందు మీరు చేసే పనిని ప్రేమించండి.. అప్పుడే విజయం సాధించగలరు.