మంచిమాట.. చచ్చే వరకు కూడా పిల్లల సంతోషం కోరేది 'అమ్మ' మాత్రమే

Durga Writes

నేటి మంచి మాట.. చచ్చే వరకు కూడా పిల్లల సంతోషం కోరేది అమ్మ మాత్రమే.. అవును.. ఈ కాలం పిల్లలకు అసలు ఏ మాత్రం అమ్మ విలువ తెలియదు.. మనం పుట్టినప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మకు పెరిగి పెద్ద అయ్యాక కాస్త కూడా మర్యాద ఇవ్వరు నేటి తరం పిల్లలు..

 

మాట్లాడితే చాలు.. నీకేం తెలీదు అమ్మ.. నువ్వు సైలెంట్ ఉండు అని కర్వేపాకు తీసేసినట్టు తీసేస్తారు.. ఓల్డ్ ఐడియాస్.. ఓల్డ్ మామ్ అంటూ కామెంట్ చేస్తారు.. తిన్నావా అంటే తిన్నలే.. బై అని చెప్తారు.. వాళ్ళకు తెలియటం లేదు.. తల్లి పట్టించుకున్నట్టు తండ్రి కూడా పట్టించుకోడు అని.. ఇప్పుడు తల్లిని అంటారు.. కానీ కష్టం వచ్చినప్పుడు మొదట అండగా ఉండేది తల్లే. 

 

ఆ విషయం తెలుసుకోకుండా తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారు.. ఆమె చచ్చే వరుకు కూడా ఆమె పిల్లలు కడుపు నిండా తిని సంతోషంగా ఉండాలి అని అనుకునేదే అమ్మ.. అమ్మ ఉన్నంత కాలం నేటి తరం పిల్లలకు విలువ తెలియదు.. తెలిశాక ఉపయోగం ఉండదు.. అందుకే అమ్మను తక్కువ చెయ్యకండి.. అమ్మ ఉన్నంత వరకే మనం అమ్మ ప్రేమను పొందగలం.. అమ్మ ఒక్కసారి దూరం అయితే ఆ ప్రేమ మరెవరిలో మీకు కనిపించదు.. దక్కదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: