మంచిమాట: తప్పు చేస్తే దొరికిపోవడం ఖాయం..!

Divya

ఒకానొక ఊరిలో రైతులు అంతా ఒకేమాటపై నిలబడి అందరికీ అనుకూలంగా ఉండే పంటలను..ఎక్కువ లాభం వచ్చే పంటల రకాలను మాత్రమే ఎంచుకొని వాటినే ఊరంతా పండించేవారు. ఇక ఈ క్రమంలోనే ఊరి రైతులంతా సంక్రాంతి పండుగ వస్తోంది కాబట్టి.. ఈ పండుగకు గుమ్మడి కాయలను పండితే మంచి లాభం ఉంటుందని మూకుమ్మడిగా రైతులంతా అనుకున్నారు.. ఈ కల తమ పొలాలలో దుక్కి దున్ని గుమ్మడి విత్తనాలను పెట్టారు పెట్టారు.. ఇక అవి కాస్త మొక్కలు గా మారి.. కొన్ని రోజులకు గుమ్మడికాయలు కాయడం మొదలుపెట్టాయి. మంచి పంట వచ్చిన సంతోషంలో రైతులు ఈ సంక్రాంతికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అని అనుకుంటూ ఉండగా.. ఆ ఊరికి దొంగల భయం చుట్టుకుంది.

ఇకపోతే ఎంతో కష్టపడి పండిస్తున్న గుమ్మడి కాయలను ఎవరో ఒక దొంగ ప్రతిరోజు దొంగలించేవాడు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి అయితే కాదు..ఆ గుమ్మడి కాయలను  పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. అలా గుమ్మడికాయల దొంగ ఎవరో  ఊర్లోనే ఉంటారని రైతుల నమ్మకం.. దొంగ ని కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు.
ఆ ఊరి పెద్దమనిషి చాలా తెలివైనవాడు.
అతను రైతుల మొర విని "ఓస్ !ఇంతేనా ! గుమ్మడికాయ దొంగలు పట్టుకోవడం చాలా సులువు.. ఆ దొంగ కి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది"అన్నాడు . ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒక రైతు  తన కుడి భుజం తడుముకుని సొట్ట ఉందో లేదో పరిశీలించుకున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి "దొంగ ఇతనే!"అని అందరికీ చెప్పాడు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనం తప్పు చేస్తామన్నా భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరైనా మనల్ని అంటున్నారేమో అనే అపోహ తో భయపడతాము. అని వివరించారు మా ఊరి పెద్దాయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: