మంచిమాట: ఆనందాన్ని అన్వేషిస్తున్నరా ? మరి అది ఎక్కడ దొరుకుతుంది..

Divya

ఆనందం మన జన్మ హక్కు. స్వతంత్రంగా సంతోషపడే హక్కు మనకు ఉంది అని ప్రఖ్యాత తెలుగు రచయిత చలం అన్నారు. నిజానికి మనం సంతోషంగా ఉండడానికి మనమే కారణం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకోలేక ఎంతో మంది ఎన్నో రకాలుగా తీవ్ర డిప్రెషన్ కు గురై, లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.. ముఖ్యంగా మనం ఎంత సంతోషంగా ఉంటే, అంత ఆరోగ్యంగా ఉంటాము. మనం సంతోషంగా ఉండాలి అంటే, మనకు ఏది అవసరమో ? ఎంత అవసరమో ? తెలుసుకోవాలి. మన స్థాయికి మించిన దానిని ఆశ పడకూడదు. ఒకవేళ ఆశ పడితే నెరవేర్చుకునే లాగా ఉండాలే తప్ప , దాని కోసం పాకులాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు..

సాధారణంగా మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఆ మనసుని ఆశ అనే ఒక ముసుగు  కప్పేస్తుంది. ఇక ఎప్పుడైతే ఆశ కలుగుతుందో అప్పుడు మనిషి క్రమంగా క్షీణించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మనిషి ఆనందాన్ని కోల్పోతాడు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలి అనే తపన మనిషిలో ఉండదు. అయితే ఎప్పుడైతే మనిషి సంతృప్తి చెందుతాడో అప్పుడు నిజజీవితంలో కూడా ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాడు..
ముఖ్యంగా మనం ఆనందంగా ఉండాలి అంటే చిన్న చిన్న పనుల వల్ల కూడా ఆనందంగా ఉండవచ్చు. ఇతరులు ఏమనుకుంటున్నారో ? ఏమంటారో ?అనే విషయాలను వదిలేసుకోవాలి. ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావో అదే చేయడానికి ప్రయత్నించాలి. నువ్వు చేసే పనుల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా నువ్వు ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి. నీకు ఎంత కావాలో అంత మాత్రమే దేనిపైన ఆశపడటం నేర్చుకోవాలి. ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి.

ఆనందం నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు ఉదయం లేచినపుడు నువ్వేమనుకుంటున్నావో? ఈ రోజుని ఎలా గడపాలనుకుంటున్నావో ? ఏం చేస్తే ఈ రోజు మొత్తంలో ఆనందంగా ఉండగలవో ? అనేది ప్రశ్నించుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో ఆనందం గురించి ఇంకెప్పుడో ఆలోచిద్దాం అనే ఆలోచన చేయవద్దు. నువ్వు జీవించే ప్రతీ క్షణాన్ని ఆనందించడమే జీవితం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: