జగడపాటి ఏరి !

Ravi Chandra
అడిగినా అడగకపోయినా అన్నింటా నేనున్నానని కాంగ్రెస్ 'అనధికార' ప్రతినిధిగా ఎప్పుడూ తన సర్వేలు, ఆలోచనలతో హడావుది చేసే మన విజయవాడ ఎం.పీ లగడపాటి రాజగోపాల్ గత కొన్ని వారాలుగా మీడియా ముందుకు పెద్దగా రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎం.ఐ.ఎం నిష్క్రమణ, కేసిఆర్ మేధోమధనం ప్రసంగాలు, పాత బస్తీలో ఉద్రిక్తతలు , కావూరి వ్యవహారం ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలున్నా లగడపాటి ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. క్యాబినెట్ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అసలు లగడపాటిని పట్టించుకోనేలేదు. తెలంగాణా, సమైక్యాంధ్ర విషయంలో పార్టీ ను ఇబ్బంది పెట్టిన వారందరినీ పక్కని పెట్టి ఒక విధంగా రాజగోపాల్ ఓవర్ యాక్షన్ను కాంగ్రెస్ అధిష్టానం ఇలా కట్టడి చేసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: