లక్షల కొద్దీ విద్యార్థుల భవిత : ఎస్వీయూ పరీక్షలెప్పుడయ్యా ?

Hareesh
భారత దేశంలో ఉన్న దాదాపు 819 విశ్వ విద్యాలయాల కంటే కూడా ఎక్కువ కోర్సులు, కంబినేషన్లను యూజీ, పీజీ, లా, ఫార్మసీ, ఎంబిఎ,   ఇంజనీరింగ్, ఎంసిఎ, బిఈడి, బిపిఈడి, డ్యూయల్ డిగ్రీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్రింద లక్షల మంది విద్యర్థులకు అందిస్తూ ఘనత వహించింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ.


అకాడమిక్ కేలండర్ అంటే, ఎప్పటినుండి కోర్స్ ప్రారంభమవుతుంది, ఎప్పుడు మధ్యంతర పరీక్షలు ఎప్పుడు సంవత్సరాంతర పరీక్షలు మున్నగు విషయాలను కోర్స్ ప్రారంభానికి ముందుగానే సూచించేది.
ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఈ అకాడమిక్ కేలండర్ చాలా ముఖ్యమైన విషయం, ఈ కోర్స్ తరువాత గవర్నమెంట్ లేదా పోటీ పరీక్షలకు అప్లై చెయ్యాలన్నా... వారి ప్రస్తుత కోర్స్ పరీక్షలు పూర్తి అయ్యి, వారి ఫలితాలు వస్తే మాత్రమే అది కుదురుతుంది.
ఈ పరీక్షలు, ఫలితాలు ఏమాత్రం ఆలస్యమైనా విద్యార్థులు దాదాపు సంవత్సర కాలాన్ని వృధా చేసుకున్నవారవుతారు.


ఎస్వీ యూనివర్సిటీ పరిథిలో దాదాపు 240 పైచిలుకు  కళాశాలలు, చాలా స్టడీ సెంటర్లు లక్షల మంది ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులను తయారు చేస్తున్నారు, వారందరికీ ఎస్వీ యూనివర్సిటీ వారు సూచించే అకాడమిక్ కేలండర్ అనేదే ముఖ్యమైన విషయం.
సెమిస్టర్ పద్ధతి ప్రకారం సంవత్సరానికి రెండు పరీక్షలు నిర్వహించవలసి వస్తున్న ఈ సమయంలో ప్రతి సెమిస్టర్ కూ దాదాపు 50  పరీక్షల వరకూ నిర్వహించాల్సి వస్తుంది.


ఈ వార్త రిపోర్ట్ చేసేనాటికి 24th సెప్టెంబర్ 2019 అంటే ఎస్వీ యూనివర్సిటీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఖరారైన తేదీలను ప్రకటించబడి,  లక్షల కొద్దీ సబ్జెక్టుల దరఖాస్తులు నమోదైపోయి, లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు ప్రేపరషన్ స్థితిలో ఉండాలి.
అయితే ఎంతో మంది విద్యార్థులకు ఆశానిలయమైన ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ లో దరఖాస్తుల మాట అటుంచితే... ఇప్పటివరకు పరీక్షల తేదీలను కూడా ప్రకటించలేదు.  ఇది ఇలాగే కొనసాగి పరీక్షలు లేటయితే సంవత్సరాంత పరీక్షలను లేట్ చెయ్యాలి లేకపోతే అరా - కోరా సబ్జెక్టుల కవరేజ్ తో మమ అనిపించి రెండవ సెమిస్టర్ పరీక్షలకు వెళ్ళాలి... ఏది చేసినా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నట్లేనంటున్నారు విద్యావేత్తలు.


ఎస్వీ యూ ఇంచార్జి రిజిస్ట్రార్ గారి అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రార్ చాంబర్స్ లో పంచాయతీ చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ దశలో... ఇంచార్జి రిజిస్ట్రార్ గారూ మీ దృష్టిని దయచేసి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై పెట్టండి అని కోరుకుంటున్నారా ఎస్వీ యూ పరిథిలోని లక్షల మంది విద్యార్థులు.


మరి ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ గారు, తక్కిన అడ్మినిస్ట్రేషన్ నాయకత్వం ఈ విషయంపై ఇప్పటికైనా దృష్టి పెట్టి పరీక్షలను మరింత ఆలస్యం చేయకుండా నిర్వహించాలని కోరుకుంటూ ... నిర్వహిస్తారని, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోరని ఆశిద్దాం.


65 సంవత్సరముల ఘన చరిత్ర కలిగి, యావత్ రాయలసీమ, చిత్తూరు మాత్రమే కాక... యావదాంధ్రకు మేధో భాండాగారమై, కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పేరు మీద నడపబడుతున్న శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం... జన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారి జనప్రియ పారదర్శక పాలనోలనన్నా ప్రక్షాళన కావింపబడి తెలుగు జాతికే గర్వకారణంగా నిలువాలనేదే ... స్వప్రయోజన-స్వార్ధాలకు పాల్పడే వారు కాకుండా యూనివర్సిటీని అభివృద్ది పధాన నడిపే వారు నాయకులుగా ఉండి అందరి హక్కులనూ కాపాడాలనేదే   ఈ పోరాట అంతిమ లక్ష్యం.



వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు: 

  • వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం: పది రోజులైపోయింది ?

  • ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?

  • ఎస్వీయూ..? సాయం చేసే వారినే సాధిస్తారా..? ఇదేం మాయరోగం..?

  • ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?

  • అభిన‌వ సూసైడ్ ఫ్యాక్ట‌రీలుగా త‌యార‌వుతోన్న విద్యాల‌యాల త‌ప్పులు..?

  • "వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు"

  • సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?

  • మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?

  • యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?

  • ఎస్వీయూ ప‌రువు రిజిస్ట్రార్ చేతిలో గోవిందా.. గోవిందా...?

  • అర్రే: రాష్ట్రం మొత్తం వైసీపీ ప్ర‌భుత్వం... ఇక్క‌డ మాత్రం టీడీపీ అజెండానే.. ?

  • ఎస్వీయూ ఘోరంలో రాజకీయ కోణం !

  • హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?

  • చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?

  • చట్టాలు చేసేవాళ్ళను తయారుచేసే వాళ్ళే పంచాయతీలు చేస్తే ఎలా ?

  • ఎస్వీయూ బాగుపడాలంటే డైరెక్టుగా ముఖ్యమంత్రి జగన్ గారే రంగంలో దిగాలా ?

  • పేరుకు ఆచార్యులు.. వీళ్లకు సాంప్రదాయాలు పట్టవా ?

  • ఇన్చార్జి రిజిస్టర్ అయితే పంచాయతీలు చేస్తారా?

  • విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?

  • హతవిధీ : ఎస్వీయూ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ...?

  • హవ్వా 'ఎస్వీయూ' నీకిది తగునా ?

  • ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: