చంద్రన్నను ఆఖరుక్షణాల్లో చెల్లెమ్మలకు పెట్టిన 'పసుపు కుంకుమ' కాపాడుతుందా?

ఐదేళ్ళూ ఏమీ చేయకుండా కూర్చొని అధికారాన్ని, అందులోని సారాన్ని, కాంట్రాక్టుల రూపంలో స్వంత సామాజిక వర్గానికి మేలు చేస్తూ, కుమారుణ్ణి తొలుత ఎమెల్సీ, ఆ తరవాత మంత్రి చేసే పనిలో మునిగి పోయారు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు.


నవ్యాంధ్ర ముఖ్యమంత్రైన తొలిదశలో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనేసే పనిని దాదాపు మూడవ వంతు సమయం గడిపేశారు. ఆ తరవాత అమరావతి భూసేకరణ నుండి నిర్మాణ ఆకృతుల కోసం సమయం తినేసి అసలు రాజధాని నిర్మాణం ఆసాంతం లోప భూయిష్టం చేసేశారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రం నుండి తీసుకొని అందులోని సారాన్ని తన వాళ్లకు పంచిపెట్టేశారు.


ఐదేళ్ల పాలన అనంతరం తమను గెలిపించే అంశం గురించి మాట్లాడమంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు రెండు విషయాలని వల్లె వేస్తున్నారు.      

*'పసుపు – కుంకుమ' తమ విజయావకాశాలను అదే ప్రభావితం చేస్తుందని

*‘వృద్ధాప్య పెన్షన్’ మొత్తం పెంపు అంశాన్ని చెబుతున్నారు.


ఈ రెండు కార్యక్రమాలు కూడా ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో ఉన్నాయనంగా మొదలైనవే. వృద్ధాప్య పెన్షన్ మొత్తాలను తమకు అధికారం దక్కితే రెండు వేల రూపాయల మొత్తానికి పెంచుతా మంటూ జగన్మోహనరెడ్డి చాన్నాళ్లుగానే చెబుతూ వచ్చారు. 


ఆ హామీని ఎన్నికల ముందు అమలు చేసేసినట్టుగా అనిపించారు చంద్రబాబు నాయుడు. వృద్ధుల పెన్షన్ మొత్తాలను రెండు వేల రూపాయలకు పెంచారు. ఇక డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ అంటూ చంద్రబాబు తలా పది వేల రూపాయల మొత్తాన్ని చేతిలో పెట్టారు. మూడు విడతల్లో మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి ఆ డబ్బు ను ప్రభుత్వ ఖజానా నుంచి వేయించారు.


ఇప్పుడు అదే తమను కాపాడుతుందనేది తెలుగుదేశం పార్టీ లెక్కగా తెలుస్తోంది. వాస్తవానికి 'పసుపు- కుంకుమ' అనే ఈ డబ్బుల వ్యవహారం వెనుక వేరే కథ ఉంది. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు & వడ్డీలేని రుణాల పథకం ఒకటి ఉంది. అది గతం నుంచి ఉంది.

ఆ పథకాల ప్రకారం ముందుగా రూపాయి వడ్డీతో డబ్బులను డ్వాక్రా మహిళల నుంచి రుణాలను వసూలు చేస్తారు. మొత్తం పూర్తయ్యాకా వారికి వడ్డీ మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. ఆ డబ్బునే చంద్రబాబు నాయుడు 'పసుపు-కుంకుమ' పేరు పెట్టి పోలింగ్ కు ముందు వారిచేతికి అందేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఈ వ్యూహం అయితే స్పష్టం అవుతోంది. అయితే తెలుగుదేశం ఆశలు మాత్రం ఆ పథకం మీదే ఉన్నాయి. మహిళలు అంతా తమకే ఓటేశారని అందుకే వారికి ధన్యవాదాలు అని కూడా తెలుగుదేశం వాళ్లు పదే పదే ప్రకటించేస్తూ ఉన్నారు. మరి అసలు కథ ఏమిటో ఫలితాలు వస్తే కానీ తెలియదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: