సరిగ్గా సరైన సమయంలో చంద్రబాబుకు షాక్! టిడిపి నిండా విజయమాల్యాను మించిన ఆర్ధిక నేఱగాళ్ళే!

వైసిపి సీనియర్ నాయకులు వి. విజయసాయిరెడ్డి మరోసారి టిడిపి నాయకులపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మొత్తం ఆర్థిక నేరగాళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని బడా రాజకీయ నాయకులుగా చెలామణీ అవుతున్న ఒక పది మంది బ్యాంకులకు ₹ 75000 కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. వారితో పోలిస్తే ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా చాలా చిన్న అతి చిన్న చేప అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

విజయసాయిరెడ్డి గతకొంతకాలంగా ట్విట్టర్ ద్వారా తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్న తీరు కొందరి గుండెల్లో మంటలు రగుల్చుతున్న విషయం తెలిసిందే. ఇలా ఎన్నికల రోజు ఆయన సంచలనాత్మక ట్వీట్ చేశారు. లగడపాటి రాజగోపాల్, సుజనా చౌధరి, రాయపాటి సాంబశివ రావు, గంటా శ్రీనివాస రావు ఇంకో 10 మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకు లకు ఎగ్గొట్టిన మొత్తం ₹75000 కోట్ల పైమాటే. యధార్ధంగా వీళ్లెవరూ వ్యక్తిగతంగా దివాళా తీయలేదు. వీళ్ళంతా తమ బినామీల పేర్లమీద తమ ఆస్తులు బదలాయించి జల్సాలు నేడు చేస్తున్నారు. నిజంగా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా వీళ్లకంటే చాలా చిన్నచేప" అని పేర్కొన్నారు. 

విజయసాయిరెడ్డి ఆర్థిక నేరగాళ్లుగా పేర్కొన్న నాయకుల్లో లగడపాటి రాజగొపాల్ తప్ప మిగతావారంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారే. ఇందులో రాయపాటి సాంబశివ రావుతో పాటు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టిడిపి తరపున శాసన నిర్మాణ సభలకు అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. దీంతో కీలక పోలింగ్ సమయంలో వారిని ఆర్థికనేర గాళ్లంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 

ఇక మరోట్వీట్ లో చంద్రబాబు బుధవారం ఈసీ ఎదుట చేపట్టిన ధర్నా ఒకనాటకమని ఆరోపించారు "ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది దృష్టి మళ్లించడానికే చంద్ర బాబు ఎన్నికల  సిఇఓ కార్ఫ్యాలయం ముందు ధర్నాకు దిగాడు. గందర గోళం సృష్టించి డబ్బు తరలించే వాహనాలు, వ్యక్తులకు సేఫ్ ప్యాసేజ్ ఇప్పించాలనే ఈ డ్రామా లాడుతున్నాడు. జగనన్న సైనికులు ఇంకో 24 గంటలు రెప్పవాల్చకుండా పహారా కాయాలి. డబ్బు పంపిణీని అడ్డుకోవాలి" అని విజయసాయిరెడ్డి వైసిపి శ్రేణులకు సూచించారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: