గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?

Edari Rama Krishna
రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ కాకుండా వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచే నేతలు కొందరు ఉంటారు. ఆ కొందరులో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ముందు వరుసలో ఉంటారు. అలా వ్యక్తిగత ఇమేజ్‌తోనే ఇంతకాలం టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో పడేలా చేశారు.. వరుసగా 2004, 2009లో టీడీపీ నుండి గెలిచిన నాని 2014లో వైసీపీ నుండి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఈ సారి కూడా ఆయనే మళ్ళీ గెలుస్తాడని గుడివాడ ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

ఈ క్రమంలోనే నానిని ఢీకొట్టలేక చేతులెత్తిసిన చంద్రబాబు...అక్కడ స్థానిక నేతలకి కాదని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ని ఈసారి గుడివాడ బరిలో నిలిపారు. పోనీ అవినాష్‌కి నానీని ఢీకొట్టే సత్తా ఉందా అంటే కష్టమనే చెప్పాలి. దీంతో అవినాష్ కూడా గుడివాడలో చేతులెత్తేసే పరిస్తితి నెలకొంది. ఏ వూరు సెంటర్‌లో చూసిన మళ్ళీ నానీనే గెలుస్తాడని..మొత్తం గుడివాడని రాజన్నమయం చేసేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు.


అసలు నాని వ్యూహాలు ముందు అవినాష్ నిలబడటం కష్టమని తెలిసిపోతుంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు... ఈ సారి కూడా గెలవడం ఖాయమని గుడివాడ ప్రజల మూడ్ చూస్తే అర్ధమైపోతుంది.  ఇక టీడీపీలో అసంతృప్త నేతలు పైకి బాగానే కనిపిస్తున్న లోలోపల రగులిపోతున్నారు. తమని కాదని అవినాష్‌కి టికెట్ ఇవ్వడంతో..వారు పూర్తిగా సహకరించడం కష్టమని తెలుస్తోంది.


గుడివాడలో తమ నేతలకి టికెట్ దక్కకపోవడంతో....వారి అనుచర వర్గాలు అవినాష్‌కి మద్ధతు తెలపడం కష్టమే అని అర్ధమవుతుంది. ఈ పరిణామలన్నీ నానికి ఇంకా మెజారిటీ పెరగడానికి ఉపయోగపడతాయని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా గుడివాడలో నాని గెలుపు ఖాయం అవ్వడంతో...ఈ సారి కూడా చంద్రబాబు కలలు కల్లలుగా మిగిలిపోవడం పక్కా...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: