టీడీపీ యువ ఎమ్మెల్యే హవా కొనసాగుతుందా...!

VUYYURU SUBHASH
ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్నవేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి తణుకులో టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సింగపూర్‌లో ఉండి వచ్చిన అరిమిల్లి రాధాకృష్ణ  తణుకు  టీడీపీ టికెట్ దక్కించుకుని గెలుపు బావుటా ఎగరవేశారు. సుమారు 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి చీర్ల రాధాకృష్ణపై విజయం సాధించారు. ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు అరిమిల్లికే టికెట్ కేటాయించారు. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు.
అయితే ఎన్‌ఆర్‌ఐ గా వచ్చిన ఆదరించిన తణుకు ప్రజలకు ఆయన ఎమ్మెల్యేగా మంచి సేవలే అందించారు.  ఈ ఐదేళ్లలో రోడ్ల అభివృద్ధి బాగా జరిగింది.

ప్ర‌తీ ప‌ల్లెకి రోడ్లు ప‌డ్డాయి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి అందేలా చేశారు. త్రాగునీరు, సాగునీరు సకాలంలో అందేలా చేశారు. పారిశ్రామిక కేంద్రగా ఉన్న తణుకుని ఇంకా అభివృద్ధి బాటపట్టించారు. ఇక అంద‌రితో క‌లిసిపోయే వ్య‌క్తిత్వం ఆయ‌న‌కు సొంతం. విప‌క్ష పార్టీలు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా టీడీపీలో ఆయ‌న యువ‌ నాయ‌కుడిగా ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే 2018లో ఏపీలో ఉత్తమ ఎమ్మెల్యేల జాబితాలో అరిమిల్లి మొదటిస్థానంలో నిలిచారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటు వారి సమస్యలు పరిష్కరించడం, నియోజకవర్గంలో ప్రజలకు సంక్షేమ ఫలాల అందేలా చేయడంలో అరిమిల్లి ఈ ర్యాంక్ కొట్టేశారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈసారి ఎన్నికలు ఉండవు. ఇక్కడ వైసీపీ, జనసేనలు బలంగా ఉన్నాయి. 


గతంలో ఎమ్మెల్యేగా చేసిన కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మళ్ళీ తణుకు వైసీపీ బరిలో ఉన్నారు.  ఈ నియోజకవర్గంపై ఆయనకి మంచి పట్టుంది. వ్యక్తిగతంగా ఎలాంటి మచ్చ లేని వ్యక్తి కావడంతో ఆయనకి మద్ధతుదారులు కూడా ఎక్కువే ఉన్నారు. గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయాలని ఆయన ప్రజలని కోరుతున్నారు. సీనియర్ నేతగా ఉన్న కారుమూరికి యూత్‌లో రాధాకృష్ణకి ఉన్నంత క్రేజ్ లేదనే చెప్పాలి.  ఇక జ‌న‌సేన నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన పసుపులేటి వెంకటరామారావు పోటీ చేయొచ్చు. గతంలో ఇక్కడ ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన అభ్యర్ధికి 47 వేల ఓట్ల వరకు వచ్చాయి. ఇక్క‌డ క‌మ్మ‌, కాపు సామాజిక‌వ‌ర్గాలు గెలుపు ఓట‌ములను డిసైడ్ చేస్తారు అనే చెప్పాలి.. త‌ర్వాత బీసీలు ఎక్కువగా ఉన్నారు. అయితే జనసేన పోటీ చేసే అభ్యర్ధి ఓట్లని ఎక్కువగా చీల్చే అవకాశం ఉంది. మరి ఈ చీలిక ఎవరికి కలిసొస్తుందో చూడాలి. కానీ ఎక్కువ అభివృద్ధి చేసిన అరిమిల్లి వైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: